రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆక్టోపస్ బలగాలు మాక్‌డ్రిల్ నిర్వహించాయి. భక్తులను అప్రమత్తం చేసిన బలగాలు తమ గన్లతో గస్తీ నిర్వహించారు. ఎవరైనా అసాంఘిక శక్తులు ఉత్సవాల్లో ప్రవేశిస్తే వారిని ఎలా ఎదుర్కోవాలో భక్తులకు వివరించారు. డాగ్స్ స్క్వాడ్‌తో పాటు ఫైర్ సేఫ్టీ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు భద్రత కల్పించే విషయంలో ఉత్సవాల నాటి రద్దీని దృష్టిలో పెట్టుకుని మాక్‌డ్రిల్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఇది చూడండి : సర్వాంగ సుందరం భద్రకాళీ బండ్