ETV Bharat / state

NVSS Prabhakar: "సీఎం కేసీఆర్​ వైఖరిపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశాం" - ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్ ప్రెస్​ మీట్​

NVSS Prabhakar On Central Government Schemes: ఫెడరల్​ స్ఫూర్తికి అనుగుణంగా సీఎం కేసీఆర్​ పనిచేయడం లేదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు.

NVSS Prabhakar
ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​
author img

By

Published : Feb 25, 2022, 2:01 PM IST

Updated : Feb 25, 2022, 2:32 PM IST

NVSS Prabhakar On Central Government Schemes: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగిస్తున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. పదే పదే ఫెడరల్ స్పూర్తి గురించి మాట్లాడే కేసీఆర్.. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణలో అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఈ మేరకు హైదరాబాద్​ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సీఎం కేసీఆర్​ వైఖరిపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశాం: ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​

కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశాం

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఫసల్ బీమా, ఆయుష్మాన్ భారత్​ పథకాలను తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఎన్వీఎస్ఎస్​ ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తుంటే.. సర్పంచ్​లను రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం తెలంగాణకు వచ్చి కేంద్ర ప్రభుత్వ పథకాలపై నిర్మలా సీతారామన్ సమీక్ష నిర్వహిస్తానని చెప్పినట్లు ఆయన తెలిపారు.

అధిక నిధులు కేటాయించింది

"ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదు. రాజ్యాంగ స్పూర్తికి కేసీఆర్ విఘాతం కలిగిస్తున్నారు. ఆత్మనిర్భర్​ భారత్ ద్వారా కేంద్రం అనేక రాయితీలు ఇస్తుంటే... తెలంగాణలో మాత్రం అమలు కావడం లేదు. వార్షిక బడ్జెట్​లో రైల్వే, రహదారులకు అధిక నిధులు కేటాయించింది. కేంద్రం ఇచ్చే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ అంశాలన్నీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ దృష్టికి తీసుకెళ్లా. బడ్జెట్​ సమావేశాల అనంతరం.. సమీక్ష నిర్వహిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు." -ఎన్వీఎస్​ఎస్​ ప్రభాకర్​, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఇదీ చదవండి: KTR On Forest restoration : 'దేశంలోని రాష్ట్రాలన్ని తెలంగాణను ఫాలో అవ్వాల్సిందే'

Last Updated : Feb 25, 2022, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.