కరోనా ప్రభావంతో గాంధీ ఆస్పత్రి బయటి రోగుల విభాగం వద్ద రద్దీ తగ్గింది. కరోనా వైరస్ అనుమానితులకు ఇక్కడే ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. కరోనా ఒకరి నుంచి మరొకరకి సోకే అవకాశం ఎక్కువగా ఉన్నందున.. గాంధీకి వచ్చే రోగుల సంఖ్య తగ్గిపోయింది.
3వేలకు తగ్గిన ఓపీ సంఖ్య
సాధారణంగా గాంధీ ఆస్పత్రికి ప్రతిరోజు 4వేల మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. కరోనా వెలుగు చూసిన తరువాత.... ప్రతి నిత్యం ఉండే ఓపీ సంఖ్య మూడు వేలకు తగ్గిపోయింది. కరోనా భయంతో.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇప్పుడు గాంధీకి రాకపోవడమే ఇందుకు కారణం.
కరోనా భయం వద్దు..
అయితే కరోనా భయం అవసరం లేదని... ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎలాంటి ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. అనుమానితులకు ప్రత్యేక వార్డులో ప్రత్యేక సిబ్బంది మాత్రమే... చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చూడండి: ట్రంప్‌కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు