ETV Bharat / state

నుమాయిష్​కు వేళాయే - జనవరి 1 నుంచి ఇక సందడే సందడి - Nampally Grounds

Numaish Exhibition 2024 in Nampally Grounds : జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్-2024 ప్రదర్శన ప్రారంభం కానున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రదర్శనకు రాబోయే సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.

Numaish Exhibition 2024 in Hyderabad
Numaish Exhibition 2024 in Nampally Grounds
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 5:48 PM IST

Updated : Dec 30, 2023, 7:31 PM IST

Numaish Exhibition 2024 in Nampally Grounds : నగరంలో నిర్వహించబోయే నుమాయిష్‌-2024 ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు(Sridhar Babu) పేర్కొన్నారు. జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో(Nampally Exhibition Grounds) జరగనున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఏర్పాట్లను పరిశీలించారు.

'రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు - పాత లబ్ధిదారులందరికీ కొనసాగిస్తాం'

Numaish Exhibition 2024 in Hyderabad : పారిశ్రామిక విప్లవం తర్వాత ఇదొక పెద్ద వేదికని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. స్వాతంత్య్రం పూర్వం నుంచి సాగుతున్న ఈ ప్రదర్శనకు ఎంతో చరిత్ర ఉందన్నారు. నగరంలో జరిగే నుమాయిష్(Numaish- 2024) ప్రదర్శనకు 15 రోజుల్లో లక్షల మంది ప్రజలు ప్రదర్శనను తిలకించడానికి వస్తారన్నారు. ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.

గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచింది : డిప్యూటీ సీఎం భట్టి

ఈసారి 2400 పైచిలుకు ఎగ్జిబిటర్లు వస్తున్నారని శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. దేశంలో ప్రతి రాష్ట్రం నుంచి ఎగ్జిబిటర్లు తరలి వస్తున్నారన్నారు. తొలిసారిగా నూమాయిష్‌లో శాఖాహారం రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అపోలో యాజమాన్యం కూడా ఓ క్లీనిక్ ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ ప్రదర్శనకు వచ్చే సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కరోనా వైద్య పరీక్షలు కూడా చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. నుమాయిష్ ప్రదర్శనను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

"జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నుమాయిష్‌- 2024 ప్రదర్శన ప్రారంభమవుతోంది. జనవరి 1 నుంచి 15 రోజుల పాటు జరగనున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్​ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. స్వాతంత్య్రం పూర్వం నుంచి సాగుతున్న ఈ ప్రదర్శనకు ఎంతో చరిత్ర ఉంది. ఈసారి 2400 పైచిలుకు ఎగ్జిబిటర్లు వస్తున్నారు. నుమాయిష్ ప్రదర్శనను విజయవంతం చేయాలి". - శ్రీధర్‌ బాబు, పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి

నుమాయిష్​కు వేళాయే జనవరి 1 నుంచి ఇక సందడే సందడి

'కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి'

Last Updated : Dec 30, 2023, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.