ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ, ప్రైవేట్ వైద్య కళాశాలల మధ్య వివాదం ముదురుతోంది. ఈ మేరకు వైద్య కళాశాలలకు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ నోటీసులు పంపారు. కన్వీనర్, యాజమాన్య కోటా విద్యార్థులను కౌన్సిలింగ్ ద్వారా చేర్చుకోకపోవడంపై నోటీసులు ఇచ్చారు. విద్యార్థులను ఈ నెల 8న చేర్చుకోకపోతే చర్యలు ఉంటాయని వర్సిటీ, కళాశాలలను హెచ్చరించారు.
వర్సిటీ లేఖపై స్పందించిన ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యం తిరిగి లేఖ రాసింది. విద్యార్థులను చేర్చుకునేది లేదని గతంలోనే లేఖ రాశామని.. ఇప్పుడూ అదే మాట మీద ఉంటామని తెలిపింది.