ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15న స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించనున్నారు. పదో తరగతి పాసైన రెండు తెలుగు రాష్ట్రాల బాలికలు ఈ పరీక్షకు అర్హులని ఎన్టీఆర్ ట్రస్టీ ఎండీ భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రతిభగల విద్యార్థినులకు ఇంటర్ విద్యకు సాయం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ టెస్ట్‌లో మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.5వేలు, 11 నుంచి 25 ర్యాంకులను సాధించిన వారికి నెలకు రూ.3వేల చొప్పున ఉపకారవేతనం అందిచనున్నారు.
ఇదీ చూడండి: మురికి వదలనుంది: మూసీ ప్రక్షాళనకు మూడు ప్రణాళికలు!