Eenadu Auto Expo: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా.. కంపెనీల డీలర్లను, కార్ల డీలర్లను.."ఈనాడు"సంస్థ ఒకే వేదికపైకి తీసుకురావడాన్ని ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అభినందించారు. విజయవాడలోని.. సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరిగే ఈనాడు ఆటో ఎక్స్‌పోను కలెక్టర్ ప్రారంభించారు. అన్ని కంపెనీలకు సంబంధించిన వాహనాలను 30 స్టాళ్లల్లో ప్రదర్శనకు ఉంచారు.
ఆటో ఎక్స్‌పో ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు లక్కీడ్రా ద్వారా బహుమతులు అందిస్తున్నారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజరు కె.రంగరాజన్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా డీజీఎం రజనీకాంతరావుతో పాటు వివిధ వాహన కంపెనీలకు చెందిన ప్రముఖులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: