కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించాలని మరోసారి జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కృష్ణానది యాజమాన్య బోర్డు, కేంద్ర పర్యావరణ శాఖలు రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికలు ఇవ్వాల్సి ఉందని రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రారావు ఎన్జీటీలో ప్రస్తావించారు. ఏపీ సర్కార్ అడ్డుకోవడంతో అధికారులు పరిశీలనకు వెళ్లలేకపోయారని ఎన్జీటీకి వివరించారు.
రాయలసీ ఎత్తిపోతలపై గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ.. అది జాబితాలో లేదు. ఈ సందర్భంలోనే తాము ఏపీ సర్కార్‌పై ధిక్కరణ పిటిషన్ వేసిన అంశాన్ని రామచంద్రారావు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్, తాము వేసిన ధిక్కరణ పిటిషన్‌ను కలిపి విచారణ జరపాలని ఏఏజీ కోరారు. ఈ మేరకు రాయలసీమ ఎత్తిపోతల అంశం తమ దృష్టిలో ఉందన్న ఎన్జీటీ.. ఈ నెల 23న విచారణ జరుపుతామని తెలిపింది.
ఇదీ చూడండి: Rayalaseema Lift Irrigation: 'రాయలసీమ' నిర్మించుకోవడం తప్ప వేరే మార్గం లేదు