ETV Bharat / state

పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా ఎన్​ఎస్​యూఐ వినూత్నంగా నిరసన - Telangana news

పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా హైదరాబాద్​లో ఎన్​ఎస్​యూఐ వినూత్నంగా నిరసన చేపట్టింది. 'టూ వీలర్ బైక్స్ ఫర్ సెల్' అంటూ ప్రదర్శన పెట్టి నిరసన తెలిపారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

Nsui protest against petrol rates in Hyderabad

author img

By

Published : Jun 11, 2021, 2:12 PM IST

పెరిగిన పెట్రోల్, డీజల్ ధరలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు... హైదరాబాద్ హిమాయత్ నగర్​లో ఎన్​ఎస్​యూఐ వినూత్నంగా నిరసన చేపట్టింది. ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ ఆధ్వర్యంలో... హిమాయత్ నగర్ కూడలి వద్ద భారత్ పెట్రోల్ పంప్ ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'టూ వీలర్ బైక్స్ ఫర్ సెల్' అంటూ ప్రదర్శన పెట్టి నిరసన తెలిపారు. తోపుడు బండ్లపై ప్రజలను తరలిస్తూ వినూత్నంగా నిరసనకు దిగారు.

పెట్రోల్ ధరలు వందకు చేరువవ్వడంతో.. నరేంద్ర మోదీ ఫేస్ మాస్క్​తో క్రికెటర్ వేషధారణతో సెంచరీ కొట్టినట్లు అభివాదం చేశారు. కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ప్రజలపై ఈ ధరలు పెను ప్రభావం చూపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధరలను తగ్గించాలని వెంకట్ డిమాండ్ చేశారు.

ఇదీ చుడండి: Petrol price: రికార్డు స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.