ETV Bharat / state

ఎన్​ఎస్​యూఐ నిరసన - hyderabad

నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఎన్​ఎస్​యూఐ నేతలు విమర్శించారు. ఇందిరా పార్క్​ ధర్నా చౌక్​లో విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు.

బూట్లు పాలిష్​ చేస్తూ నిరసన
author img

By

Published : Mar 6, 2019, 3:52 PM IST

హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బూట్లు పాలిష్​ చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. భాజపా సర్కార్​ యువతకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిరుద్యోగులకు బ్యాంకుల్లో డబ్బులు జమ చేస్తానని హామీ ఇచ్చి ఓట్లు దండుకుని మోసం చేశారన్నారు.

ఇవీ చదవండి: 'జగిత్యాలలో అగ్నిప్రమాదం'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.