తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు(NRI cell Germany congratulated KCR) ప్రవాస భారతీయ సంఘాలు, ఎన్నారైల నుంచి శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యమ సారథి కేసీఆర్... దశాబ్దాల తెలంగాణ కలను నెరవేర్చడమే కాకుండా.. దేశ, విదేశాల్లో తెరాస పార్టీ సభ్యులకు స్ఫూర్తిదాయకమయ్యారని ఆ పార్టీ ఎన్నారై సెల్ జర్మనీ అధ్యక్షుడు అరవింద్ గుంత(NRI cell Germany congratulated KCR) కొనియాడారు. ఈ మేరకు ఆయన జర్మనీ నుంచి ఓ సందేశం పంపారు. తెరాస ద్విదశాబ్ది వేడుకల్లో ఎన్నారై ప్రతినిధులకు అవకాశం కల్పించిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, ఎన్నారై కో- ఆర్డినేటర్ మహేశ్ బిగాలకు అరవింద్ ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నో సంక్షేమ పథకాలు
కేసీఆర్.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే తండ్రి లాంటివారని అరవింద్(NRI cell Germany congratulated KCR) కొనియాడారు. చావుకు ఎదురెళ్లి పోరాడి నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజానీకం చిరకాల ఆకాంక్ష నెరవేర్చిన యోధుడని ప్రశంసించారు. ఆయన నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతుబీమా, కీలక వ్యవసాయ రంగానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా, దళితబంధు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, పంటకు గిట్టుబాటు ధరలు వంటి పథకాలు ఆదర్శంగా మారాయన్నారు.
ఇలాంటి పథకాలను.. ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం కోరుతున్నారని ఆయన "ఈనాడు-ఈటీవీ భారత్"కు చెప్పారు. భవిష్యత్తులో తెరాస మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్(NRI cell Germany congratulated KCR)కు ఆ పార్టీ ఎన్నారై సెల్ జర్మనీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు అరవింద్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: KTR AT PLENARY: 'తెలంగాణలో 'త్రీ ఐ' నడుస్తోందని చెప్పా'