ETV Bharat / state

అన్ని కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటున్నాం: నౌహీరా షేక్ - హైదరాబాద్ తాజా వార్తలు

మహిళలకు అండగా నిలబడేందుకు మహిళా సాధికారత పార్టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కృషి చేస్తామని హీరా గ్రూప్స్ సీఈఓ నౌహీరా షేక్ తెలిపారు. తాను రాజకీయాల్లోకి రావడం ఇష్టంలేని ఎంఐఎం నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి అక్రమంగా కేసులు బనాయించేలా చేశారన్నారు.

Heera Groups CEO NOWHERA   Sheikh
హీరా గ్రూప్స్ సీఈఓ నౌహీరా షేక్
author img

By

Published : Mar 31, 2022, 10:53 PM IST

అన్ని కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటున్నానని హీరా గ్రూప్స్ సీఈఓ నౌహీరా షేక్ తెలిపారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానన్నారు. సుప్రీంకోర్టు పెట్టిన షరతులన్నీ అమలు చేసినట్లు పేర్కొన్నారు. హీరా గ్రూప్స్​కు సంబంధించిన డేటాను తిరిగి ఇచ్చేయాలని ఎఫ్ఎస్ఎల్​ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే రెండుసార్లు సుప్రీంకోర్టు ఆదేశించినా ఎఫ్ఎస్ఎల్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి కోర్టును ఆశ్రయించామని తెలిపారు.

హీరా గ్రూప్స్​కు చెందిన ఐటీ ప్రతినిధులతో ఎఫ్ఎస్ఎల్​కు వెళ్లి డేటా తెచ్చుకుంటామని తెలిపారు. వీలైనంత త్వరలో హీరా గ్రూప్స్ వ్యాపారం యథావిధిగా కొనసాగుతుందని నౌహీరా షేక్ పేర్కొన్నారు. హీరా డిజిటల్ గోల్డ్ పేరుతో కొత్త వ్యాపారం ప్రారంభించామన్నారు. హీరా గ్రూప్స్​కు సంబంధించిన 87 ఆస్తులపైనా పూర్తి హక్కులను యాజమాన్యానికే చెల్లేలా తీర్పు వచ్చిందన్నారు. తనపై నమోదైన కేసులన్నింటిని తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 29 కేసులకు సంబంధించి ఫిర్యాదుదారులకు 3.5కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆమె తెలిపారు. చివరి ఖాతాదారుల వరకు డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నౌహీరా షేక్ తెలియచేశారు.

ఇదీ చదవండి: హీరా గ్రూప్‌ సభ్యుల అభివృద్ధికి కృషి చేస్తా: నౌహీరా షేక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.