టీఎస్ ఆర్టీసీలో బస్సులు నడపడానికి అర్హత కల్గిన తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ అభ్యర్థుల ఎంపిక కోసం ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్ అభ్యర్థులకు రోజుకు రూ.1,500, కండక్టర్ అభ్యర్థులకు రోజుకు రూ.1,000 చొప్పున చెల్లిస్తున్నారు. ఇంకా అదనంగా డ్రైవర్, కండక్టర్లను తీసుకోవడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలో రోజువారి పారితోషికం పద్ధతిన పదవీవిరమణ పొందిన ట్రాఫిక్, మెకానికల్, సూపర్ వైజర్స్కు రూ.1,500 వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు.
మెకానిక్స్, శ్రామిక్స్, ఎలక్ట్రిషన్స్, టైర్ మెకానిక్స్, క్లరికల్ సిబ్బందితో పాటు ఇతర విభాగాలకు చెందిన పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు రోజుకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని పేర్కొన్నారు. ఓల్వో, ఏసీ, మల్టియాక్సిల్స్పై అనుభవం ఉన్న డ్రైవర్స్, మెకానిక్‌లకు రోజుకు రూ.2వేల చొప్పున, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన అనుభవం ఉన్న డ్రైవర్లకు రోజుకు రూ.1,500లు, ఇతర శాఖలలో మెకానిక్‌గా పనిచేసిన అనుభవం ఉన్నవారికి, రవాణాకు సంబంధించిన అనుభవం ఉన్న వారికి రోజుకు రూ.వెయ్యి చొప్పున వేతనం ఇవ్వనున్నారు. సాఫ్ట్వేర్ నిపుణులకు ఐటీ ట్రైనర్‌గా రోజుకు రూ.1,500ల చొప్పున ఇస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సమీప డిపో మేనేజర్ లేదా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
- ఈ కథనం చదవండి : ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి