ETV Bharat / state

నైపర్‌ సీటుకు పోటీ పడతారా? - pharmaceutical education

ఫార్మా విద్యారంగంలో దేశంలోనే అగ్రగామి నైపర్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌). మనదేశంలో దీని ప్రాంగణాలు ఏడు ఉన్నాయి. వీటిలో ఫార్మా పీజీ చేసినవారికి పరిశ్రమ పెద్ద పీట వేస్తోంది. అందుకే బీ-ఫార్మసీ చదివిన వారంతా ప్రతిష్ఠాత్మకమన నైపర్‌ ప్రాంగణాల్లో పీజీ సీటు సాధించాలని ఆశిస్తారు. జాతీయస్థాయి నైపర్‌-జేఈఈ 2021 ప్రవేశ పరీక్ష ప్రకటన ఇటీవల విడుదలైంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా నైపర్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో చేరొచ్చు!

notification-for-to-pharma-pg
నైపర్‌ సీటుకు పోటీ పడతారా?
author img

By

Published : Apr 19, 2021, 12:55 PM IST

దేశవ్యాప్తంగా ఉన్న ఏడు నైపర్‌ ప్రాంగణాలు నాలుగు రకాల పీజీ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి.

అవి:

1. ఎం.ఫార్మసీ: మొహలీ, హాజీపూర్‌, గువహటిలలోని నైపర్‌లు అందించే ఎం.ఫార్మసీ కోర్సులో మూడు రకాల స్పెషలైజేషన్లు ఉన్నాయి. అవి ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ఫార్ములేషన్స్‌), ఫార్మసీ ప్రాక్టీస్‌, క్లినికల్‌ రిసెర్చ్‌.

2. ఎం.ఎస్‌. (ఫార్మా): ఈ కోర్సులో పది రకాల స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఫార్మాస్యూటిక్స్‌, నేచురల్‌ ప్రాడక్ట్స్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, మెడిసినల్‌ కెమిస్ట్రీ, ట్రెడిషనల్‌ మెడిసన్‌, రెగ్యులేటరీ టాక్సికాలజీ, మెడికల్‌ డివైజెస్‌, బయో టెక్నాలజీ, ఫార్మకో ఇన్‌ఫర్మేటిక్స్‌.

3. ఎం.టెక్‌ (ఫార్మా): దీనిలో రెండు పీజీ కోర్సులు ఉన్నాయి. ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (బయో టెక్నాలజీ), ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ (ప్రాసెస్‌ కెమిస్ట్రీ).

4. ఎంబీ.ఏ (ఫార్మా): ఇది ఫార్మసీలో మేనేజ్‌మెంట్‌ కోర్సు.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ నమోదుకు చివరి తేదీ: 8 మే 2021
అడ్మిట్‌ కార్డ్టు లభ్యమయ్యే తేదీ: 21 మే 2021
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 5 జూన్‌ 2021 ఎంబీఏ (ఫార్మా) లో చేరే విద్యార్థులకు జాయింట్‌ కౌన్సెలింగ్‌ (గ్రూప్‌ ఇంటర్వ్యూ) ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: దేశంలోని 16 కేంద్రాలలో నైపర్‌ జేఈఈ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో- విజయవాడ, హైదరాబాద్‌.

పరీక్ష విధానం
నైపర్‌-జేఈఈ 2021 పరీక్ష బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ ఛాయిస్‌) పద్ధతిలో కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు చొప్పున గరిష్ఠంగా 200 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కు తగ్గిస్తారు.

స్కోరు కోసం...

నైపర్‌- జేఈఈలో మంచి స్కోరు సాధించాలంటే పుస్తక పరిజ్ఞానంతోపాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, అనలిటికల్‌ రీజనింగ్‌ నైపుణ్యాలు ముఖ్యం. ప్రతి పాఠ్యాంశాన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.

* బీ-ఫార్మసీ విద్యార్థులకు కళాశాలల్లో సుమారు 20 రకాల సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలు బోధిస్తారు. వీటిలో ముఖ్యమైనవి ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, కెమిస్ట్రీ, మెడిసినల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, నేచురల్‌ ప్రాడక్ట్స్‌, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీలతోపాటు కొన్ని జనరల్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు కూడా ఉంటాయి.

* నేచురల్‌ ప్రొడక్ట్స్‌కు సంబంధించి బయొలాజికల్‌ టాపిక్‌ల కంటే ఫైటో కెమిస్ట్రీపై శ్రద్ధ చూపాలి.

* ఫార్మకాలజీ, టాక్సికాలజీలలో ఔషధాల వర్గీకరణ, ఫార్మకోకైనటిక్‌, ఫార్మకో డైనమిక్స్‌, క్లినికల్‌ ఫార్మసీ, పేథో ఫిజియాలజీ, డ్రగ్‌ ఇంటరాక్షన్లు, కీమోథెరపీ, జనరల్‌ ఫార్మకాలజీ, సెంట్రల్‌ నర్వస్‌సిస్టంపై దృష్టిపెట్టాలి.

* ఫార్మాస్యూటిక్స్‌కు సంబంధించి ట్యాబ్‌లెట్స్‌, క్యాప్స్యూల్స్‌, సిరప్స్‌, ఇంజెక్షన్లు, ఆయింట్‌మెంట్లతో సహా అన్ని రకాల ఔషధాల తయారీలో మెలకువలు, ఫార్ములేషన్‌ డెవలప్‌మెంటు విధానాలు తెలిసి ఉండాలి.

* డ్రగ్‌ చట్టాలు, ఫిజికల్‌ ఫార్మసీ, హాస్పిటల్‌ - కమ్యూనిటీ ఫార్మసీ, డిస్పెన్సింగ్‌, పేషెంట్‌ కౌన్సెలింగ్‌లపై శ్రద్ధ చూపాలి.

* బయో టెక్నాలజీలో యాంటీ బయోటిక్స్‌, విటమిన్లు, వ్యాక్సిన్లు, అమైనో యాసిడ్లు మొదలైన బయో ఔషధాల తయారీ, విశ్లేషణలను చదవాలి. ఎంజైమ్స్‌, జీనీ ఎక్స్‌ప్రెషన్‌, మ్యుటేషన్‌, రీకాంబినేషన్లు, బ్యాక్టీరియోఫేజ్‌, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌, ఇన్సులిన్‌, జీన్‌థెరపీలపై అవగాహన పెంచుకోవాలి.

* ఆప్టిట్యూడ్‌ ప్రశ్నల విషయానికొస్తే సింపుల్‌ మ్యాథమేటిక్స్‌, లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలిస్‌లతోపాటు ఇంగ్లిష్‌ భాషకు సంబంధించిన ప్రశ్నలూ వచ్చే అవకాశం ఉంది. పీసీ రే అవార్డు ఎవరికి వచ్చింది? వరల్డ్‌ డయాబెటిక్‌ డే ఎప్పుడు జరుపుతారు లాంటి ప్రశ్నలు కూడా అడగవచ్చు. అందువల్ల సైంటిఫిక్‌ జనరల్‌ నాలెడ్జ్‌ని పెంచుకోవడం మంచిది.

- డా. ఎం. వెంకటరెడ్డి

ఇదీ చూడండి: '80 శాతం మందిలో లక్షణాల్లేవ్.. కానీ ప్రమాదకరమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.