Model Schools: ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 16, 17 తేదీల్లో జరగనున్నాయి. మోడల్ స్కూళ్లలో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ఉషారాణి తెలిపారు. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏడు నుంచి పదో తరగతి ప్రవేశాల కోసం ఏప్రిల్ 16న.. ఆరో తరగతి ప్రవేశాల కోసం ఏప్రిల్ 17న పరీక్ష జరగనుంది.
మే 20న మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడించి... మే 23న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. మే 24 నుంచి 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి.. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు ఉషారాణి తెలిపారు.
ఇదీ చదవండి: