రాష్ట్రంలో జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపునకు ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. రేపటి నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.
అదనపు సెక్షన్ల అనుమతికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కళాశాల పేరు, ఆవరణ, ఇతర మార్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఆలస్య రుసుముతో జులై 8 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. జులై 20 వరకు గుర్తింపు కళాశాలల జాబితా వెల్లడించనున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి : 'ప్రైవేటు వ్యక్తులను ఆదుకునేందుకే కేంద్రం ప్యాకేజీ తెస్తోంది'