GHMC EVDM Officials Notices To All Communities: ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో దక్కన్ మాల్ అగ్ని ప్రమాద ఘటన జరగ ముందే.. మార్చి నెలలో స్వప్నలోక్ కాంప్లెక్‌లో అగ్ని ప్రమాదం ఘటన భారీ ఆస్తినష్టాన్నే కాకుండా ఆరుగురు యువతను మింగేసింది. ఇలాంటి ఘటనలు జరగకుండా జీహెచ్ఎంసీ అధికారులు కట్టుదిట్టమైన చర్యలకు పూనుకున్నారు. అగ్నిమాపక నిబంధనలు పాటించని పలు ఆసుపత్రులు, మాల్స్, పాఠశాలలు, కమర్షియల్ కాంప్లెక్స్, గోదాములు, సిలిండర్ స్టోర్స్, ఫార్మా, ప్లాస్టిక్, రబ్బరు తదితర 23 రకాలకు చెందిన దుకాణదారులకు జీహెచ్ఎంసీ ఈవీడీఎం అధికారులు నోటీసులు పంపారు.
నగరంలో తరచూ అగ్ని ప్రమాదాల జరగడంపట్ల రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వెంటనే సీఎస్ శాంతికుమారి అధ్యక్షతన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో అగ్ని ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని గత నెలలో ఆదేశాలు జారీ చేశారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లలో అగ్ని ప్రమాద నివారణ పరికరాలను, ప్రమాదాల పట్ల హెచ్చరికలు జారీ చేసే అలారం, తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుకు తగ్గట్లు నేడు జీహెచ్ఎంసీ అధికారులు చర్యల్లో భాగంగా వారికి నోటీసులు ఇచ్చారు.
అమీర్‌పేటలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్, సికింద్రాబాద్‌లోని షాపర్స్ స్టాప్, మినర్వా కాంప్లెక్స్.. చాంద్రాయణగుట్టలోని రిలయన్స్ స్మార్ట్, కవాడిగూడలోని ఎన్టీపీసీ బిల్డింగ్, ఈసీఐఎల్ తులసి ఆసుపత్రికి.. నోటీసులు జారీ చేశారు. సెల్లార్లో వెకెంట్ చేయాలని అత్యవసర దారులు తెరిచి ఉండాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మూడు రోజుల్లో సరిచేసుకోకుంటే సీజ్ చేస్తామని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి హెచ్చరించారు.
అబిడ్స్‌లోని కారు గ్యారేజ్‌లో అగ్ని ప్రమాదం: తెల్లవారు జామున అబిడ్స్‌లోని కారు గ్యారేజ్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని అధికారి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. గతంలో కూడా అగ్నిప్రమాదాలు జరిగేవని కానీ.. ప్రాణ నష్టాలు ఎక్కువగా జరగలేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసినప్పటికీ పాటించడం లేదన్నారు. ముఖ్యంగా ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస గృహాలు, ఫంక్షన్ హాలు, బహుళ అంతస్థుల భవనాల వారికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
అగ్ని ప్రమాదాలు వల్ల చాలా అప్రమత్తంగా ఉండాలని.. మెట్ల మార్గాన్ని మూసివేయకుండా ప్రణాళిక రూపొందించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో తాము అందరి దగ్గరకీ వెళ్లి అగ్నిమాపక నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: