ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్లోని మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇంటి బయట నిలిపి ఉన్న వాహనాలే లక్ష్యంగా చేసుకుని రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు మహమ్మద్ జాఫర్ యాకుత్పూరాలో నివాసం ఉంటున్నాడు.
గతంలో మహంకాళి పోలీస్స్టేషన్ పరిధిలో మూడు బైకులు, నిజామాబాద్లో మరో బైక్ను నకిలీ తాళం ఉపయోగించి తీసుకెళ్లాడు. సమాచారం తెలుసుకున్న మహంకాళి పోలీసులు ఛేదించి నిందితున్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి : అరబ్షేక్ల లీలలు.. పాతబస్తీ యువతులతో రహస్య పెళ్లిల్లు