ETV Bharat / state

భాగ్యనగరంలో జోరుగా ఆఖరు రోజు జీహెచ్​ఎంసీ నామినేషన్​ ప్రక్రియ - అబిడ్స్​ తాజా వార్తలు

హైదరాబాద్​ నగరవ్యాప్తంగా జీహెచ్​ఎంసీ ఎన్నికల నామినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అబిడ్స్​ జీహెచ్​ఎంసీ కార్యాలయానికి ఆఖరు రోజున వివిధ పార్టీల అభ్యర్థులు చేరుకుని.. నామపత్రాలను సమర్పించారు. నామినేషన్​ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేశారు.

nominations filed by candidates for ghmc elections in Hyderabad
భాగ్యనగరంలో జోరుగా ఆఖరు రోజు జీహెచ్​ఎంసీ నామినేషన్​ ప్రక్రియ
author img

By

Published : Nov 20, 2020, 12:40 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల నామినేషన్​ ప్రక్రియ చివరి రోజు హైదరాబాద్​లో ఘనంగా కొనసాగుతోంది. నామినేషన్​ కేంద్రాల వద్ద వంద మీటర్ల వరకు ఎలాంటి ర్యాలీలు, పెద్ద ఎత్తున జనాలు ఉండకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ పార్టీల అభ్యర్థులు.. అబిడ్స్​ జీహెచ్​ఎంసీ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్​ అధికారికి నామపత్రాలను అందజేశారు.

అబిడ్స్​ జీహెచ్​ఎంసీ కార్యాలయంలో హిమాయత్​నగర్​ సీపీఐ అభ్యర్థిగా ఛాయాదేవి, దత్తాత్రేయనగర్​ తెరాస అభ్యర్థి సలీమ్​, బాగ్​ అంబర్​పేట సీపీఎం అభ్యర్థి వరలక్ష్మి, అంబర్​పేట భాజపా అభ్యర్థి పద్మ వెంకట్​రెడ్డి, జాంబాగ్​ భాజపా అభ్యర్థి రూప్​ ధరక్​, గోల్నాక స్వతంత్ర అభ్యర్థి పల్లవి తదితరులు నామినేషన్​ దాఖలు చేశారు.

ఇదీ చదవండిః రేపటితో ముగియనున్న గడువు... పోటెత్తిన అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.