హైదరాబాద్లోని ప్రగతి భవన్ వద్ద పీడీఎస్‌యూ నేతలు ఆందోళనకు దిగారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నిరసనగా ధర్నా చేపట్టారు. ప్రైవేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ తీరు పట్ల వారు మండిపడ్డారు. రాష్ట్రంలో మరిన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యారంగానికి నిధులు అధికంగా కేటాయించాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: కర్ణాటకీయం: మళ్లీ మొదటికి వచ్చిన సంక్షోభం