Musi River Purification Proposals Not Pending In Center : మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు ఏవీ.. తమ వద్ద పెండింగ్‌లో లేవని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు బీఆర్‌ఎస్ ఎంపీలు గడ్డం రంజిత్ రెడ్డి, మాలోత్ కవితలు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. తెలంగాణ నుంచి స్కైవే నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్రమంత్రి తన సమాధానంలో వెల్లడించారు.
తెలంగాణలో మూసీ నది పరిరక్షణ కోసం ఎన్‌ఆర్‌సీపీ కింద రూ.335.65 కోట్లలతో కాలుష్య నివారణ పనులు పూర్తి అయ్యాయని మంత్రి తెలిపారు. 2007 నుంచి 2013 వరకు హైదరాబాద్ రోజుకు 593 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో 4 ఎస్‌టీపీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద 28 ఎంఎల్‌డీ సామర్థ్యంతో 2 ఎస్‌టీపీలు నిర్మించినట్లు వివరించారు.
Gajendra Shekawat On Musi River Cleaning : జీహెచ్‌ఎంసీ నుంచి మురుగు నీటిని 100 శాతం శుద్ధి చేయడానికి రూ.3,866 కోట్ల వ్యయంతో.. 1,259.5 ఎంఎల్‌డీల సామర్థ్యం కలిగిన 31 ఎస్‌టీపీలను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి వివరించారు. 2020లో మూసీనది పరిరక్షణకు సంబంధించిన నాలుగు ఎస్‌టీపీల కోసం ప్రతిపాదనలు రాగా.. పరిశీలన తర్వాత వాటిని తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు తెలిపారు. తర్వాత సవరించిన ప్రతిపాదనలు రాలేదని గజేంద్రసింగ్ షెకావత్.. తన సమాధానంలో వివరించారు.
ఇంకా మురిగి కుంపటిగా మూసీ నది : ఎక్కడో అనంతగిరి కొండల్లో పుట్టి వందల కిలోమీటర్ల ప్రయాణం చేసిన మూసీ నది.. గత వైభవాన్ని చంపేసుకుంది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో విరాజిల్లింది. కానీ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెంది.. విస్తరిస్తున్న కొలదీ మూసీ మురుకు కుంపటిలా మారిపోయింది. అన్నింటికన్నా మానవ తప్పిదాలే మూసీ నదిని సంకట స్థితిలోకి తెచ్చాయి. పరిశ్రమల నుంచి వ్యర్థాలు, విష రసాయనాలు, డ్రైనేజ్ మురుగు నీరు, జంతు కళేబరాలు, ఆసుపత్రి వ్యర్థాలు ఇలా ఒకటేమిటి అనేక రకాలు కేంద్రం కాలుష్యం నదిగా గుర్తించే స్థితికి తెచ్చారు. అందుకే మళ్లీ మూసీ నదికి తన పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు మూసీ జలాలను శుద్ధి చేస్తున్నారు. మళ్లీ మూసీ నది ప్రక్షాళన చేస్తామని.. ప్రభుత్వాలు నాలుగు సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాయి.
ఇవీ చదవండి :