రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచవద్దని స్పష్టం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. లాక్ డౌన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని జీవో 46లో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తెలిపారు.
ఏ రూపంలోనూ ఫీజులు పెంచవద్దని జీవోలో విద్యా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సహా అన్ని రకాల ప్రైవేట్ పాఠశాలలు... ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి స్పష్టం చేశారు. జీవోను బేఖాతరు చేస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 872కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు