ETV Bharat / state

పీఆర్‌సీ నివేదికపై ఆందోళన వద్దు: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ - ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ వార్తలు

కేసీఆర్​... కార్మిక పక్షపాతి అనే విషయం ఉద్యోగులు గుర్తుంచుకోవాలన్నారు.. మంత్రి శ్రీనివాసగౌడ్​. 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వమని పీఆర్‌సీ కమిటీ నివేదించినంత మాత్రాన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

srinivas goud
పీఆర్‌సీ నివేదికపై ఆందోళన వద్దు: మంత్రి శ్రీనివాసగౌడ్​
author img

By

Published : Jan 28, 2021, 10:03 PM IST

Updated : Jan 28, 2021, 10:57 PM IST

పీఆర్‌సీ నివేదికపై ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందవద్దని... మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భరోనానిచ్చారు. దీనిపై ఉద్యోగ సంఘాలతో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చిస్తారన్నారు. కేసీఆర్​... కార్మిక పక్షపాతి అనే విషయం ఉద్యోగులు గుర్తుంచుకోవాలన్నారు. ఒక్క నెలలో 14 వేల మందికి పదోన్నతులు కల్పించిన ఘనత ముఖ్యమంత్రిదేనని స్పష్టం చేశారు.

ఎక్కడ లేని విధంగా గతంలో ఉద్యోగులకు 43 ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని చెప్పారు. 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వమని పీఆర్‌సీ కమిటీ నివేదించినంత మాత్రాన ఉద్యోగులు ఆందోళ చెందాల్సిన పని లేదన్నారు.

గతంలో ఉన్న పెన్షన్‌ విధానాన్నే తిరిగి కొనసాగించే విధంగా ఏంచేయాలి... అనే అంశంపై గెజిటెడ్‌ అధికారులు దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే తెలంగాణ ఉద్యోగులను తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చామని... అక్కడ పనిచేస్తున్న మరికొంత మందినీ రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

రవీంద్రభారతిలో గెజిటెడ్‌ అధికారుల సంఘం డైరీని.. అధ్యక్షురాలు మమతతో కలిసి మంత్రి శ్రీనివాసగౌడ్​ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నేతలు పాల్గొన్నారు.

పీఆర్‌సీ నివేదికపై ఆందోళన వద్దు: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ఇవీచూడండి: ఫిట్‌మెంట్‌ 43 శాతం కంటే తగ్గకుండా ఇవ్వాలి : ఉద్యోగ సంఘాలు

పీఆర్​సీ సిఫారసులను అంగీకరించేది లేదు: యూటీఎఫ్​

7.5 శాతం ఫిట్‌మెంట్ ఆమోదయోగ్యం కాదు: పీఆర్టీయూ

Last Updated : Jan 28, 2021, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.