హైదరాబాద్ కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కొత్తగా వచ్చే గర్భిణులకు వైద్యం చేసేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు. దీనితో గర్భిణులు వెనుతిరిగి పోతున్నారు. తమకు వైద్యం ఎందుకు అందించడం లేదని ఆసుపత్రి సిబ్బందితో గర్భిణులు వాగ్వాదానికి దిగారు.
కరోనా తీవ్రత కారణంగా కొత్త రోగులకు వైద్యం అందించలేమని వైద్యులు తెలిపారు. వ్యయప్రయాసాలకు ఓర్చి వైద్యానికి వస్తే వెనక్కి పంపుతున్నారంటూ గర్భిణులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: గుడ్న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్!