మినీ పురపోరులో అభ్యర్థుల నామినేషన్ల ఆమోదానికి పన్నుల చెల్లింపునకు సంబంధించిన నోడ్యూ సర్టిఫికెట్లు తప్పనిసరి కాదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కొంతమంది రిటర్నింగ్ అధికారులు నోడ్యూ సర్టిఫికెట్ల కోసం ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టి వచ్చిందని, తాము ఇప్పటి వరకు అలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపింది.
నోడ్యూ సర్టిఫికెట్ల కోసం ఒత్తిడి చేయవద్దని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎవరైనా ఆర్వోలు నోడ్యూ సర్టిఫికెట్ల కోసం ఒత్తిడి చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇదీ చదవండి: పెరోల్‌పై విడుదలై.. తిరిగిరాని వేల మంది ఖైదీలు