ETV Bharat / state

డిజిటలైజేషన్ వైపు ఎన్​ఎమ్​డీసీ అడుగులు - NMDC digitization news

ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ (ఎన్​ఎమ్​డీసీ) డిజిటలైజేషన్ వైపు అడుగులు వేసింది. నూతన సిస్టమ్ ద్వారా తీసిన తొలి డిజిటైజ్ ఇన్​ వాయిస్​ను సీఎండీ సుమిత్ దేవ్ ఆవిష్కరించారు.

డిజిటైజేషన్ వైపు ఎన్​ఎమ్​డీసీ అడుగులు
డిజిటైజేషన్ వైపు ఎన్​ఎమ్​డీసీ అడుగులు
author img

By

Published : Jan 11, 2021, 8:16 PM IST

ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ (ఎన్​ఎమ్​డీసీ) డిజిటలైజేషన్ వైపు అడుగులు వేసింది. ఇందుకోసం ఉద్దేశించిన సాప్ ఆధారిత ఈఆర్​పీ సిస్టంను సంస్థ కార్యకలాపాల్లో ఇంప్లిమెంట్ చేయనున్నట్లు సీఎండీ సుమిత్ దేవ్ ప్రకటించారు.

నూతన సిస్టం ద్వారా తీసిన తొలి డిజిటలైజేషన్ ఇన్​ వాయిస్​ను ఆయన మాసబ్​ట్యాంక్​లో ఆవిష్కరించారు. సహ భాగస్వామి ఆక్సెంచర్ ఈ నూతన ఈఆర్​పీ సిస్టంను అభివృద్ధి చేసి నిర్వహణ కోసం మానిటర్ చేయనుంది. ఈ నూతన సిస్టం ద్వారా సంస్థ వర్క్ ఆర్డర్లు మొదలు.. బిల్లింగ్, ఇన్ వాయిస్, చెల్లింపులు, ప్లాంట్ మెయింటెనెన్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, మెటీరియల్ మేనేజ్ మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, క్వాలిటీ మేనేజ్ మెంట్ అన్నీ డిజిటల్ మాధ్యమంలో ఎన్​ఎమ్​డీసీ నిర్వహించనుంది.

డిజిటలైజేషన్ వైపు ఎన్​ఎమ్​డీసీ జర్నీలో ఇదొక కీలక మైలురాయి అని సంస్థ సీఎండీ సుమిత్ దేవ్ అన్నారు. బిగ్ బ్యాంగ్ అప్రోచ్ ద్వారా అమలు చేస్తున్న ఈ నూనత సిస్టం ద్వారా తమ వ్యాపార భాగస్వాములకు, తమ పార్టనర్​లకు సులభతర వాణిజ్యానికి ఈ నూతన ఈఆర్​పీ సిస్టం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పదోన్నతుల విషయంలో ఉద్యోగులకు తీపికబురు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.