హైదరాబాద్ కాచిగూడ డివిజన్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్, ఆయన సతీమణి ప్రియాంక.. 200 మంది పేదలు, మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాలు అందించారు. ఈ కార్యక్రమం అర్వింద్ బంధువులైన ఆది వేణుగోపాల్ సునీత దంపతుల జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది.
"ప్రజలకు ఏం కావాలో కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడిగా నరేంద్ర మోదీకి తెలుసు. గతంలో ఎన్నో విపత్తులను చూసిన ప్రధాని ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలకు ఏం కావాలో నేరుగా అది ప్రజలకు అందే విధంగా బ్రహ్మాండమైన ప్యాకేజీని రూపొందించారు. దానిపై కూడా కేసీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు."
-అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
ఇదీ చూడండి: కరోనా రికార్డ్: 24 గంటల్లో 5,611 కేసులు, 140 మరణాలు