ఓ అవినీతి ఎలక్ట్రికల్ ఇంజినీర్ లంచం తీసుకుంటూ అనిశాకు అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ నారాయణగూడలో... నిజామాబాద్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ కాంతారావు నివసిస్తున్నాడు. మంచిర్యాల జిల్లాకు కూడా ఆయనే ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మెహదీపట్నం మారుతీనగర్‌కు చెందిన రామారావు... రామగుండంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కాంతారావును కోరాడు. ఇందుకు రూ. 70 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు హైదరాబాద్‌లో కాంతారావు లంచం తీసుకుంటుండగా... ఏసీబీ అధికారులు దాడి చేసి అడ్డంగా పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అనిశా అధికారులు సూచించారు.