ETV Bharat / state

ఒంటరి మహిళలే ఆ 'సీరియల్‌ కిల్లర్‌' టార్గెట్‌ - కనిపిస్తే దోపిడీ, హత్య - చివరకు? - SERIAL KILLER ARRESTED IN VALSAD

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన సీరియల్‌ కిల్లర్‌ - తెలంగాణలో సహా పలు రాష్ట్రాల్లో హత్యలు

Serial Killer Involved Many Crimes in Several States Arrested in Valsad
Serial Killer Involved Many Crimes in Several States Arrested in Valsad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2024, 3:19 PM IST

Serial Killer Involved Many Crimes in Several States Arrested in Valsad : ఒంటరి మహిళలే లక్ష్యంగా దోపిడీలు, హత్యాచారాలకు పాల్పడుతున్న ఓ సీరియల్‌ కిల్లర్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తెలంగాణ సహా నాలుగైదు రాష్ట్రాల్లో అతడు హత్యలకు పాల్పడ్డాడని, వివిధ రాష్ట్రాల్లో 10కి పైగా ఇతరత్రా కేసులు ఉన్నట్లు సమాచారం. రైళ్లలో ప్రయాణిస్తూ ఎప్పటికప్పుడూ ప్రదేశాలు మారుస్తున్నట్లు గుర్తించారు. 2000 సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించి, ఓ జైలు అధికారి తోడ్పాటుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఒంటరిగా కనిపిస్తే చాలు దోపిడీ, హత్య : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హరియాణాకు చెందిన రాహుల్‌ జాట్‌ అనే వ్యక్తి పాత నేరస్థుడు. రాజస్థాన్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో చోరీలు, ఆయుధాల అక్రమ రవాణా తదితర కేసుల్లో జైలుకి వెళ్లివచ్చాడు. ఈ క్రమంలో ఒంటరిగా మహళలు కనిపిస్తే హత్యాచారాలకు పాల్పడేవాడు. ముఖ్యంగా రైళ్లలో ప్రయాణించేవారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు తెలబడేవాడు. కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లోని రైళ్లు, రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో ఈ తరహా హత్యలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. అరెస్టుకు ముందు రోజు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ రైలులో మహిళను దోపిడీ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

అమాయక మహిళలే టార్గెట్​ - కోరిక తీర్చుకుని కిరాతకంగా చంపేస్తాడు - కానీ? - MAN KILLED 6 WOMEN IN MAHABUBNAGAR

2000 సీసీ కెమెరాలు జల్లెడ పట్టి : ఇటీవల గుజరాత్‌లోని ఉద్వాడా రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టాలపై ఓ యువతి (19) మృతదేహం లభ్యమైంది. ట్యూషన్ నుంచి తిరిగి వస్తున్న ఆమె హత్యాచారానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆయా రాష్ట్రాల పోలీసులను సమన్వయం చేసుకోవడంతో పాటు గుజరాత్‌లోని ఆయా ప్రాంతాల్లో దాదాపు 2000 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఓ ఫుటేజీలో అనుమానితుడని స్పష్టమైన ఫొటో కనిపించగా సూరత్‌లోని లాజ్‌పోర్‌ సెంట్రల్‌ జైలు అధికారి అతడిని రాహుల్‌ జాట్‌గా గుర్తుపట్టారు. ఈ క్రమంలోని వల్సాడ్‌ జిల్లాలోని వాపీ రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌లో అతడిని అరెస్టు చేశారు.

ఆస్తి కోసం ఆరుగురి వరుస హత్యల కేసు - ప్రధాన నిందితుడు సహా ఐదుగురి అరెస్ట్​

Hyderabad Psycho Killer Case : రూ.500 అవసరం పడిందా.. ఓ ప్రాణం పోయినట్టే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.