ETV Bharat / state

జల వనరుల పునరుద్ధరణలో దేశంలో తెలంగాణ టాప్

జల వనరుల పునరుద్ధరణలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మిషన్‌ కాకతీయ గొప్ప ఫలితాలు అందిస్తోందని నీతిఆయోగ్ విడుదల చేసిన ‘సమగ్ర నీటి యాజమాన్య సూచిక-2019’ నివేదికలో కితాబిచ్చింది. ఈ పథకం వల్ల 51.5 శాతం పంటల సాగు పెరిగిందని వెల్లడించింది. 2015-16లో వెనుకబడిన రాష్ట్రం.... మూడేళ్లలోనే అద్భుత ఫలితాలు సాధించింది.

author img

By

Published : Aug 24, 2019, 8:28 AM IST

Updated : Aug 24, 2019, 11:55 AM IST

అలుగు పోస్తున్న చెరువు
జల వనరుల పునరుద్ధరణలో దేశంలో తెలంగాణ టాప్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం అద్భుతంగా ఉందని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో జలవనరుల పునరుద్ధరణ గొప్పగా జరిగిందని కొనియాడింది. ఈ విషయంలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని ‘సమగ్ర నీటి యాజమాన్య సూచిక’ నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు జలవనరుల నిర్వహణ, తాగు, సాగునీరు అందించడంలో చూపుతున్న ప్రతిభను ఆధారంగా చేసుకుని నీతి ఆయోగ్‌ మూడేళ్లుగా నివేదికలు విడుదల చేస్తోంది.

22,500 చెరువులు

2019కి గానూ నివేదికను కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌, సీఈవో అమితాబ్‌కాంత్‌ విడుదల చేశారు. ఇందులో మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా 2018 మార్చినాటికి 22,500 చెరువులు పునరుద్ధరించారు. చెరువుల కింద 51.5% మేర సాగు పెరిగినట్లు పేర్కొన్నారు.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • నీటివనరుల పునరుద్ధరణలో తెలంగాణ దేశంలో తొలిస్థానంలో నిలిచింది.
  • మూడేళ్లలో సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకున్న తొలి రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.
  • 2015-16లో తొలి నివేదిక విడుదల చేసే సమయానికి తెలంగాణ కనిష్ఠ పనితీరు కనబరిచిన రాష్ట్రాల జాబితాలో ఉన్నప్పటికీ ఈ మూడేళ్లలో అది 50 పాయింట్లను దాటింది.
  • జలవనరుల కింద సాగునీటి యోగ్యతను 100 శాతం పునరుద్ధరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 60 శాతం గ్రామీణ ప్రాంతాలకే తాగునీరు అందుతున్నప్పటికీ నీటినాణ్యత సమస్యలను 100 శాతం పరిష్కరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎదురవుతున్న నీటి నాణ్యత సమస్యలను తగ్గించడంలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో నిలిచింది.
  • ప్రస్తుతం పట్టణప్రాంతాల్లో 80% ఇళ్లకు తాగునీరు అందుబాటులోకి వచ్చింది. అందులో 75% మంది నుంచి రుసుములు కూడా వసూలు చేస్తున్నారు.
  • మధ్యతరహా సాగునీటి వనరులను అంచనా వేయడానికి ప్రభుత్వం నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ ద్వారా అధ్యయనం చేయించి ఆ వివరాలను భువన్‌ వెబ్‌పోర్టల్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచింది.
  • సమగ్ర నీటి వినియోగంలో 50 పాయింట్లతో దేశంలో పదో స్థానంలో నిలిచింది.

భూగర్భ జలాల పునరుద్ధరణలో వెనుకంజ

భూగర్భ జలాలు విపరీతంగా వాడిన ప్రాంతాలు, ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాలను గుర్తించి రీఛార్జింగ్‌కు వీలుగా మ్యాపింగ్‌ చేసే విషయంలో తెలంగాణ పనితీరు బాగాలేదు. ఈ విషయంలో చివరిస్థాయిలో నిలిచింది. గతేడాదితో పోల్చితే 65 శాతం పాయింట్లను కోల్పోయింది. కేవలం 12 శాతం భూగర్భజల రీఛార్జి ప్రాంతాలనే మ్యాపింగ్‌ చేసింది. అందులోనూ 5 శాతం ప్రాంతంలో మాత్రమే రీఛార్జికి అవసరమైన మౌలిక వసతులను కల్పించింది. జలవనరుల నిర్వహణ, యాజమాన్య విభాగాల్లో నీటి వినియోగ సంఘాల భాగస్వామ్యం పెంపొందించడంలో మాత్రం చివరి స్థానంలో ఉంది.

ఇదీ చూడండి: రైలెక్కేసెయ్​.. శ్రీరామ జాడలపై ఓ లుక్కేసేయ్​!

Intro:Body:Conclusion:
Last Updated : Aug 24, 2019, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.