హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాఫీ కంపెనీ సీసీఎల్ ప్రొడక్ట్స్‌కు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీనటి నిత్యామీనన్‌ను ప్రకటించారు. ఇప్పటివరకు ప్రధాన కాఫీ సంస్థలకు సరఫరాదారుగా ఉన్నామని, కొన్ని నెలల క్రితం దేశీయ మార్కెట్లోకి సొంత ఉత్పత్తులను ప్రవేశపెట్టామని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ సీఈవో ప్రవీణ్ జైపూరియార్ తెలిపారు. దేశీయంగా కాఫీ పరిశ్రమ రూ.2,500 కోట్ల మార్కెట్‌ను కలిగి ఉందని, ఇందులో ఇన్‌స్టంట్ కాఫీ రూ.2 వేల కోట్ల మార్కెట్‌తో 8 నుంచి 10 శాతం వార్షిక వృద్ధి నమోదైందని ఆయన పేర్కొన్నారు. ఫిల్టర్ కాఫీ మార్కెట్ రూ.500 కోట్లు ఉందని, ఇందులో దక్షిణ భారత రాష్ట్రాల వాటా 95 శాతమన్నారు. సంస్థకు దేశంలో ఉన్న రెండు ప్లాంట్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని దీంతో పాటు వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఉత్పత్తి కేంద్రాలున్నాయని సంస్థ తెలిపింది. ప్రస్తుతం రూ.35వేల టన్నుల వార్షిక సామర్థ్యం ఉందని చిత్తూరులో ఉన్న ప్లాంటులో 12 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్యాకేజీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ శ్రీశాంత్ తెలిపారు.
ఇదీ చూడండి :ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన రాష్ట్రపతి