రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఎరువుల కొరతపై చేసిన వ్యాఖ్యలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. మంత్రి మాటలు ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి పరాకాష్టగా ఉన్నాయన్నారు. దుబ్బాకలో ఎరువుల కోసం క్యూలైన్‌లో నిలబడి మృతి చెందిన ఎల్లయ్య అనే రైతు విషయంలో బాధ్యత రాహిత్యంగా సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబడి చనిపోతే సినిమా వాళ్ళదా తప్పు అని మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించి దేశానికి అన్నం పెట్టే రైతు పట్ల ఈ ప్రభుత్వానికి కనీస కనికరం లేదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే రైతాంగానికి క్షమాపణ చెప్పి... ఎల్లయ్య కుటుంబాన్నిఅన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: జాతీయ 'ప్రఖ్యాత సంస్థ'గా హైదరాబాద్ విశ్వవిద్యాలయం