Niranjan Reddy on Palamuru Rangareddy Project : ఈ శతాబ్దపు అతి పెద్ద మానవ విజయం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకమని వ్యవసాయ శాఖ మంత్రి సింగ్రెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఎత్తిపోతల పథకం అని తెలిపారు. కృష్ణమ్మ నీళ్లను కలశాల్లో గ్రామ, గ్రామానికి తీసుకువచ్చి ప్రతి దేవాలయం, ప్రార్ధనాలయాల్లో అభిషేకం చేస్తామని.. 2015 జూన్ 11న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల శంకుస్థాపన సందర్భంగా భూత్పూర్ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) అన్నారని మంత్రి గుర్తు చేశారు.
Palamuru Rangareddy Project Wet Run : 'పరాయి పాలన ఒక శాపం.. స్వపరిపాలన ఒక వరం.. హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా, కోటి మంది చంద్రబాబులు కొంగజపాలు చేసినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేస్తాను. పాలమూరు రైతుల కాళ్లను కృష్ణా నీళ్లతో కడుగుతా' అని సీఎం కేసీఆర్ వాగ్ధానం చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) తెలిపారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఇంటిదొంగలు, పాలోల్లు, పక్కవాళ్లు, ఈర్ష, ద్వేషాలతో కేసులు వేశారని, కేంద్రం తొమ్మిదిన్నరేళ్లుగా కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చకపోవడం ప్రాజెక్టుకు ప్రధాన అవరోధంగా మారిందని అన్నారు. ప్రాజెక్టు ముందుకు సాగకుండా అనేక రకాల అవరోధాలు కల్పించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. సీఎం వ్యూహానికి ప్రతి వ్యూహం చేసి రాజ్యాంగబద్ధంగా అనుమతులు సాధించారని చెప్పారు.
-
ఈ శతాబ్దపు అతి పెద్ద మానవ విజయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల .. ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఎత్తిపోతల పథకం
— BRS Party (@BRSparty) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
పరాయి పాలన ఒక శాపం !
స్వపరిపాలన ఒక వరం !
హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా, కోటి మంది చంద్రబాబులు కొంగజపాలు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేస్తాను
పాలమూరు రైతుల… pic.twitter.com/IKWkmYfrI0
">ఈ శతాబ్దపు అతి పెద్ద మానవ విజయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల .. ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఎత్తిపోతల పథకం
— BRS Party (@BRSparty) September 7, 2023
పరాయి పాలన ఒక శాపం !
స్వపరిపాలన ఒక వరం !
హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా, కోటి మంది చంద్రబాబులు కొంగజపాలు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేస్తాను
పాలమూరు రైతుల… pic.twitter.com/IKWkmYfrI0ఈ శతాబ్దపు అతి పెద్ద మానవ విజయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల .. ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఎత్తిపోతల పథకం
— BRS Party (@BRSparty) September 7, 2023
పరాయి పాలన ఒక శాపం !
స్వపరిపాలన ఒక వరం !
హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా, కోటి మంది చంద్రబాబులు కొంగజపాలు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేస్తాను
పాలమూరు రైతుల… pic.twitter.com/IKWkmYfrI0
Palamuru Rangareddy Dry Run Success : బ్యాంకులు రుణాలు ఇవ్వవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులు రూ.25 వేల కోట్లు దశల వారీగా కేటాయించుకుని అత్యంత అద్భుతంగా ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని.. ఒక్కొక్కటీ 145 మెగావాట్ల మహా బాహుబలి పంపులు ఏర్పాటు చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. దశాబ్దాల క్రితమే కృష్ణా నీళ్లు పాలమూరుకు దక్కి ఉంటే దేశంలోనే ఒక హరితప్రాంతంగా, వ్యవసాయ ప్రాంతంగా, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిలో అగ్రభాగాన విలసిల్లేదని అన్నారు. ఈ ప్రాంత నేతల బానిస మనస్తత్వం, వెన్నెముక లేనితనం పాలమూరు ప్రజలకు శాపంగా నిలిచిందని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించి.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మించుకుని కృష్ణా నీళ్లను మలుపుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు.
-
పాలమూరుకు జలహారం 💦
— Singireddy Niranjan Reddy (@SingireddyBRS) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
16న మన కల సాకారం
👉 నార్లాపూర్ లో వెట్ రన్ నిర్వహించి పాలమూరు రంగారెడ్డిని జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
👉 బహిరంగసభకు భారీ ఎత్తున రైతులతో తరలివెళ్లాలి
👉 అనంతరం ప్రతి గ్రామానికి కలశాలలో కృష్ణమ్మ నీళ్లను తీసుకురావాలి pic.twitter.com/qHP41J1PLu
">పాలమూరుకు జలహారం 💦
— Singireddy Niranjan Reddy (@SingireddyBRS) September 7, 2023
16న మన కల సాకారం
👉 నార్లాపూర్ లో వెట్ రన్ నిర్వహించి పాలమూరు రంగారెడ్డిని జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
👉 బహిరంగసభకు భారీ ఎత్తున రైతులతో తరలివెళ్లాలి
👉 అనంతరం ప్రతి గ్రామానికి కలశాలలో కృష్ణమ్మ నీళ్లను తీసుకురావాలి pic.twitter.com/qHP41J1PLuపాలమూరుకు జలహారం 💦
— Singireddy Niranjan Reddy (@SingireddyBRS) September 7, 2023
16న మన కల సాకారం
👉 నార్లాపూర్ లో వెట్ రన్ నిర్వహించి పాలమూరు రంగారెడ్డిని జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
👉 బహిరంగసభకు భారీ ఎత్తున రైతులతో తరలివెళ్లాలి
👉 అనంతరం ప్రతి గ్రామానికి కలశాలలో కృష్ణమ్మ నీళ్లను తీసుకురావాలి pic.twitter.com/qHP41J1PLu
Palamuru Rangareddy Project Inauguration : ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామని.. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చే ఈ పథకాన్ని పట్టుదలతో పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. కలశాలతో కృష్ణా నీళ్లు(Krishna Water) తీసుకువచ్చి గ్రామాల్లో దేవాలయాల్లో దేవుళ్లను డప్పుచప్పుళ్లు, వాయిద్యాల నడుమ అభిషేకించాలి.. ప్రార్ధనాలయాల్లో చల్లుకోవాలని మంత్రి కోరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 1600 పైచిలుకు గ్రామాల్లో ఈ సంబరాలు పెద్దఎత్తున జరగాలని విజ్ఞప్తి చేశారు.
కొట్లాడి తెలంగాణ సాధించుకున్నదే ప్రధానంగా సాగు నీళ్ల కోసమని.. తెలంగాణ జెండా ఖచ్చితమైన లక్ష్యంతో ముందుకు సాగిందని.. అలాగే ఎన్నో జయాపజయాలు ఎదుర్కొన్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగస్వామిని కావడం చిరస్మరణీయమైన అంశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తన ఇంటికి కూడా కృష్ణమ్మ అని పేరు పెట్టుకున్నానన్న మంత్రి.. పాలమూరు ప్రజల ఆకలి, దాహార్తి తీర్చేది కృష్ణమ్మ అని ఆనాడు ఆ పేరు పెట్టుకున్నానని గుర్తు చేశారు.
-
తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం..
— BRS Party (@BRSparty) September 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🌊కృష్ణా జలాలతో పాలమూరు పాదాలను అభిషేకించనున్న సందర్భం
👉ఈ నెల 16న సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం#PalamuruRangareddyProject pic.twitter.com/3rGeAYFok5
">తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం..
— BRS Party (@BRSparty) September 6, 2023
🌊కృష్ణా జలాలతో పాలమూరు పాదాలను అభిషేకించనున్న సందర్భం
👉ఈ నెల 16న సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం#PalamuruRangareddyProject pic.twitter.com/3rGeAYFok5తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం..
— BRS Party (@BRSparty) September 6, 2023
🌊కృష్ణా జలాలతో పాలమూరు పాదాలను అభిషేకించనున్న సందర్భం
👉ఈ నెల 16న సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం#PalamuruRangareddyProject pic.twitter.com/3rGeAYFok5
ఉమ్మడి ఏపీలో పాలకులు పాలమూరుకు ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలు బహుమతిగా ఇచ్చి శాపంగా నిలిచారని.. కానీ, ప్రపంచంలోనే అతిపెద్ద పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ను కేసీఆర్ వరంగా ఇచ్చారని మంత్రి నిరంజన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్ పంప్ హౌస్‌లో ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ మోటార్లు ప్రారంభించనున్న నేపథ్యంలో జరిగే బహిరంగసభకు పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు.