ETV Bharat / state

విషమంగా కేఎంసీ విద్యార్థిని ఆరోగ్యం.. నిందితుడు సైఫ్ అరెస్టు - విద్యార్థిని హెల్త్​ బులిటెన్​

KMC Medical Student Latest Health Bulletin: నిమ్స్​ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న కేఎంసీ విద్యార్థిని తాజా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్​ బులిటెన్​ను విడుదల చేశారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. విద్యార్థినిని పరామర్శించడానికి మంత్రి సత్యవతి రాథోడ్​ వెళ్లారు. మరోవైపు విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడు సైఫ్​ను పోలీసులు అరెస్టు చేశారు.

mgm
ఎంజీఎం
author img

By

Published : Feb 24, 2023, 9:49 AM IST

Updated : Feb 24, 2023, 10:24 AM IST

Medical Student Latest Health Bulletin: వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కేఎంసీ విద్యార్థిని తాజా హెల్త్​ బులిటెన్​ను నిమ్స్​ వైద్యులు విడుదల చేశారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మరోవైపు విద్యార్థిని ఆత్యహత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్​ సైఫ్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈరోజు మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

విద్యార్థినికి ఎక్మో వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నామని నిమ్స్​ వైద్యులు తెలిపారు. మొది రెండు రోజులతో పోలిస్తే ఇప్పుడు విద్యార్థిని కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగ్గానే ఉన్నాయని వివరించారు. ఆమెకు డయాలసిస్​ జరుగుతోందని హెల్త్​ బులిటెన్​లో ప్రకటించారు. నిపుణులైన వైద్య బృందం విద్యార్థినిని నిశితంగా పరిశీలిస్తోందని నిమ్స్​ వైద్యులు వెల్లడించారు.

మరో వైపు వైద్య విద్యార్థినిని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ పరామర్శించారు. విద్యార్థినికి నిమ్స్​లో మెరుగైన వైద్యం అందుతోందని అన్నారు. మొదటి రెండు రోజుల కంటే ఈరోజు పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని మంత్రి తెలిపారు. ఇటువంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని.. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని వివరించారు. విద్యార్థినికి ఈ పరిస్థితి రావడానికి కారణమైన బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

విద్యార్థిని ఆరోగ్యంపై మంత్రులు, వైద్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె బాబాయ్ రాజ్ కుమార్ ఆరోపించారు. ఘటన తీవ్రత తగ్గించడానికే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన కూతురి ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు సైఫ్ హోంమంత్రి బంధువని.. అందుకే చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారని అన్నారు.

వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు గంటగంటకు వైద్య విద్యార్థిని ఆరోగ్యంపై సమీక్షిస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్​ తెలిపారు. ఇటు డాక్టర్ల వైద్యంతో పాటు.. భగవంతుడి ఆశీస్సులతో కూడా విద్యార్థిని త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇప్పుడు స్వతహాగా విద్యార్థిని ఊపిరి తీసుకుంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో పోలీస్​ వ్యవస్థ అత్యంత మెరుగ్గా ఉందని.. ప్రతి ఆడపిల్ల వెనుక ఒక నిఘా నేత్రం ఉందని మంత్రి సత్యవతి రాఠోడ్ వెల్లడించారు.​

ఇవీ చదవండి:

Last Updated : Feb 24, 2023, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.