ETV Bharat / state

వైద్యుడిని మోసం చేసిన నైజీరియన్లు.. - నైజీరియన్లు

క్యాన్సర్ వ్యాధి తగ్గేందుకు ఉపయోగించే ఔషధ మొక్కల విత్తనాలు కొనుగోలు చేస్తామని ఓ వైద్యుడిని నైజీరియన్లు మోసం చేశారు. ఇద్దరు నైజీరియన్లు కలిసి వైద్యుడి వద్ద రూ.16 లక్షల రూపాయలు వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.

వైద్యుడిని మోసం చేసిన నైజీరియన్లు..
author img

By

Published : Aug 30, 2019, 4:13 AM IST

Updated : Aug 30, 2019, 8:04 AM IST

వైద్యుడిని మోసం చేసిన నైజీరియన్లు..

సికింద్రాబాద్​లో నివాసం ఉండే ఓ వైద్యుడికి ఫేస్​బుక్ ద్వారా పరిచయమైన నైజీరియన్... తాను లండన్​లోని ప్రముఖ ఔషధ పరిశ్రమలో పనిచేస్తున్న మారియానాగా చెప్పుకుంది. క్యాన్సర్ నియంత్రించే ఔషధాలను భారత్ నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పింది. 100 గ్రాములకు లక్ష రూపాయలు చెల్లిస్తామని నమ్మబలికింది.

రూ.50 వేలకే

ఔషధ విత్తనాలను దిల్లీలో ఉన్న రాకేశ్ శర్మ రూ.50 వేలకే విక్రయిస్తున్నాడని.. అతని నుంచి లండన్ కంపెనీకి అమ్మితే లాభాలొస్తాయని తెలిపింది. వైద్యుడు రాకేశ్ శర్మను ఫోన్​లో సంప్రదించి అతని నుంచి మొదట రెండు ప్యాకెట్లు కొనుగోలు చేశాడు. వైద్యుడిని నమ్మించేందుకు మారియానా.. అతడికి సొమ్ము చెల్లించింది. ప్యాకెట్లు ఒకేసారి పెద్దమొత్తంలో సరఫరా చేయాలని సూచించింది.

16లక్షలు
లాభాలు వస్తున్నాయని ఆశతో వైద్యుడు రాకేశ్ శర్మకు మరిన్ని ప్యాకెట్లు కావాలని 16లక్షలు బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించాడు. నెలలు గడుస్తున్నా ప్యాకెట్లు రాకపోవడం వల్ల మారియానాను, రాకేశ్​ను ఫోన్​లో సంప్రదించడానికి వైద్యుడు ప్రయత్నించాడు. ఇద్దరి నెంబర్లు అందుబాటులో లేకపోవడం వల్ల మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులకు ఫిర్యాదు

రాకేశ్ శర్మ పేరు మీద నైజీరియన్.. వైద్యుడి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సైబర్ క్రైం పోలీసులు తేల్చారు. చెన్నైలోని వేర్వేరు ఖాతాల్లో నగదు బదిలీ చేయించుకున్నట్లు గుర్తించారు. ఇందులో ఇద్దరి నైజీరియన్ల హస్తం ఉన్నట్లు తేల్చిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

ఇవీ చూడండి.. మంచి మనసున్న మలయాళ మెగాస్టార్

Last Updated : Aug 30, 2019, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.