ETV Bharat / state

'పీఎఫ్​ఐ' కేసు దర్యాప్తులో ఎన్​ఐఏ దూకుడు - మోస్ట్​ వాంటెడ్​ జాబితాలోకి తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు - పీఎఫ్​ఐ నిందితులకు ఎన్​ఐఏ చార్జి షీట్​

NIA has Included Telugu States PFI Accused in Most Wanted List : పీఎఫ్​ఐ కార్యకలాపాల దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) దూకుడు పెంచింది. ఎన్​ఐఏ మోస్ట్​ వాంటెడ్​ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులను చేర్చింది. అయితే ఈ ముగ్గురిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వ్యక్తులు కాగా, మరో వ్యక్తి ఆంధ్రప్రదేశ్​కు చెందిన వ్యక్తి కావడం విశేషం.

PFI Accused in Most Wanted List
NIA has Included Telugu States PFI Accused in Most Wanted List
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2023, 4:31 PM IST

NIA has Included Telugu States PFI Accused in Most Wanted List : నిషేధిత పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా(PFI)) కార్యకలాపాల దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. ఇప్పటికే ఎన్​ఐఏ పలువురిని అరెస్టు చేయగా, తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను వాంటెడ్​(Most Wanted) జాబితాలో చేర్చి విచారణ చేస్తుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్​లోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ ఆహద్ అలియాస్ ఎంఏ అహద్, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఖాజానగర్​కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్​లను వాటెండ్ జాబితాలోకి చేర్చింది.

NIA Files Charge Sheet on PFI Accused : ఈ ముగ్గురు గురించి సమాచారం తెలిసిన వారు 9497715294కు వాట్సాప్(Whats App) ద్వారా సమాచారం అందించాలని కోరింది. ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం సైతం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పీఎఫ్​ఐ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, గత ఏడాది సెప్టెంబరులో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనం సృష్టించింది.

'పీఎఫ్​ఐ'ని నిషేధించిన కేంద్రం.. ఉపా చట్టం కింద ఐదేళ్లు బ్యాన్​

NIA Files Charge Sheet PFI Nizamabad Case : తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కర్నూలు, నెల్లూరుల్లో దాడులు చేసి పలువురిని అరెస్టు చేశారు. అంతకు ముందే నిజామాబాద్ పోలీసులు పీఎఫ్ఐ(PFI) కార్యకలాపాలపై కేసులు నమోదు చేయడం కలకలం రేపింది. ఆ కేసు ఆధారంగానే ఎన్ఐఏ రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా దాడులు చేయడం గమనార్హం. తాజాగా పీఎఫ్ఐ కేసులోనే తెలుగు రాష్ట్రాల్లోని ముగ్గురితో పాటు కేరళలో 11 మందిని, కర్ణాటకలో అయిదుగురిని, తమిళనాడులో అయిదుగురిని మోస్ట్ వాంటెండ్ జాబితాలో చేర్చింది.

PFI Case in Telangana : పాఫులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా కేసులో ఇప్పటివరకు 17 మంది నిందితులను ఎన్​ఐఏ అరెస్టు చేసింది. వీరిపై 2022లో నిజామాబాద్​ ఆరో టౌన్​ పీఎస్​లో నమోదైన కేసు ఆధారంగా కేసు నమోదు చేసి జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తును చేస్తుంది. 2047లోపు భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనే లక్ష్యంతో పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా సంస్థ నిందితులు పని చేస్తున్నారని ఎన్​ఐఏ తెలిపింది. ముస్లిం యువతకు దేహదారుఢ్య శిక్షణ పేరుతో మారణాయుధాలతో దాడి చేయడంపై నిందితులకు పీఎఫ్​ఐ సంస్థ శిక్షణ ఇచ్చినట్లు ఎన్​ఐఏ దర్యాప్తులో తేలింది. ఇప్పటికీ కూడా జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతుంది.

నిజామాబాద్​ పీఎఫ్​ఐ కేసులో మరో వ్యక్తిపై ఎన్‌ఐఏ ఛార్జీ షీట్​ - మొత్తం 17​మంది నిందితులు అరెస్టు

Nizamabad Terror Conspiracy Case : నిజామాబాద్ కుట్ర కేసులో కీలక పరిణామం.. కీలకమైన వ్యక్తి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.