రాష్ట్రంలో కొత్తగా మరో 2వేల 278 కరోనా కేసులు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య లక్షా 54వేల 880కి చేరుకుంది. కరోనా కాటుకు మరో 10మంది బలవ్వగా.... ఇప్పటి వరకు వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 950కి చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా నుంచి మరో 2 వేల 458 మంది బాధితులు కోలుకోగా... ఇప్పటివరకు ఒక లక్ష 21వేల 925 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32 వేల 5 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 25 వేల 50మంది చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 331 కరోనా కేసులు నమోదయ్యాయి.
జిల్లాల్లో కేసులు
రంగారెడ్డి జిల్లాలో 184, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 150, నల్గొండ జిల్లాలో 126, కరీంనగర్ జిల్లాలో 121 మంది వైరస్ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 98, వరంగల్ అర్బన్ జిల్లాలో 91, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో 89 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 82, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80, కామారెడ్డి జిల్లాలో 78, మహబూబాబాద్ జిల్లాలో 76, సంగారెడ్డి జిల్లాలో 62, జగిత్యాల జిల్లాలో 56 కరోనా కేసులు వచ్చాయి.
ఇదీ చూడండి: ప్రపంచదేశాలపై కరోనా పంజా.. ఇటలీలో మళ్లీ విజృంభణ