రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా ఏటా రాజ్‌భవన్‌లో నిర్వహించే ఓపెన్ హౌస్‌ను రద్దు చేయటంతో.. టెలిఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. 68 మంది నుంచి ఫోన్ ద్వారా గవర్నర్ శుభాకాంక్షలు అందుకున్నారు.
శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్ ద్వారా తమిళిసైకి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రైవేట్ ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల సమస్యలు, ఇతర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్యలను లిఖితపూర్వకంగా రాజ్‌భవన్‌కు పంపాలని గవర్నర్ వారికి సూచించారు.
ఇదీ చదవండి: కేసీఆర్‌కు ఉద్యోగసంఘాలు భయపడుతున్నాయి : బండి