New Year Traffic Restrictions in Hyderabad : నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా నగరంలో సైబరాబాద్ పరిధిలో (Traffic Restrictions) ఫైఓవర్లు, రోడ్డు మార్గాలను మూసివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదని వెల్లడించారు. వీటితో పాటు శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, షేక్‌పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-జేఎన్‌టీయూ ఫ్లై ఓవర్, కైత్లాపూర్ ఫ్లైఓవర్, బాలానగర్ ఫ్లైఓవర్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Traffic Rules on Tank bund in Hyderabad : నగరంలో చాలా మంది యువత ట్యాంక్ బండ్ వద్ద న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడానికి వస్తారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు (Hyderabad All Fly Overs Closed) మూసివేయనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారు ఖచ్చితంగా విమానం టిక్కెట్ చూపిస్తే పీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్ పైకి అనుమతినిస్తారని వివరించారు. ట్రావెల్ బస్సులు, లారీలు, హెవీ గూడ్స్ వాహనాలు, హెవీ ప్యాసింజర్ వాహనాలను జనవరి 1వ తేదీ తెల్లవారుజాము 5 గంటల వరకు అనుమతించామని పోలీసులు తెలిపారు.
-
#HYDTPinfo #TrafficAlert #TrafficAdvisory
— Hyderabad Traffic Police (@HYDTP) December 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Commuters, please make a note of the #Notification issued in view of #NewYearEve celebrations on the intervening night of 31.12.23/01.01.2024. #NTRMarg #Tankbund #TrafficRestrictions #TrafficDiversions #NewYear2024 @AddlCPTrfHyd pic.twitter.com/0WFCXPcg1A
">#HYDTPinfo #TrafficAlert #TrafficAdvisory
— Hyderabad Traffic Police (@HYDTP) December 31, 2023
Commuters, please make a note of the #Notification issued in view of #NewYearEve celebrations on the intervening night of 31.12.23/01.01.2024. #NTRMarg #Tankbund #TrafficRestrictions #TrafficDiversions #NewYear2024 @AddlCPTrfHyd pic.twitter.com/0WFCXPcg1A#HYDTPinfo #TrafficAlert #TrafficAdvisory
— Hyderabad Traffic Police (@HYDTP) December 31, 2023
Commuters, please make a note of the #Notification issued in view of #NewYearEve celebrations on the intervening night of 31.12.23/01.01.2024. #NTRMarg #Tankbund #TrafficRestrictions #TrafficDiversions #NewYear2024 @AddlCPTrfHyd pic.twitter.com/0WFCXPcg1A
న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన భాగ్యనగరం - మత్తు బాబులూ జర భద్రం
New Year Traffic Restrictions in Hyderabad : యువకులు డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ నడిపే వాహనాలపై, అలాగే ద్విచక్రవాహనాలపై ట్రిపుల్ రైడింగ్ ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు చేయనున్నారు. ఈ సమయాల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అందరూ కూడా నిబంధనలు పాటించి వేడుకలు ప్రశాంతంగా చేసుకోవాలని వారు కోరారు.
భాగ్యనగరంలోకి న్యూ ఇయర్ డ్రగ్స్ - అడుగడుగునా నిఘాతో పోలీసుల స్పెషల్ డ్రైవ్
Police Department Alert on Corona Cases : మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ (Corona Virus) చాపకింద నీరులా విజృంభిస్తుంది. కేసులు పెరుగుతున్నందున ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ న్యూ ఇయర్ సంబరాలు జరుపుకోవాలని సూచించారు. ఇలాంటి సమయాల్లో జనం సమూహాలు మంచిది కావని తెలిపారు. చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున వీలైనంత వరకు సెలబ్రెషన్స్ ఇళ్ల వద్దనే ఉండి జరుపుకోవాలని అన్నారు.
న్యూ ఇయర్‌కు కౌంట్ డౌన్ షురూ - నయాసాల్ జోష్‌లో భాగ్యనగరం
న్యూ ఇయర్ రోజు పార్టీ చేసుకుంటున్నారా - అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే