ETV Bharat / state

కొత్త ఏడాదిలో సరికొత్త లక్ష్యాలు - చేరుకోవాలంటే ఇలా ప్లాన్ చేయాల్సిందే

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 2:39 PM IST

New Year Resolution Tips in Telugu 2024 : కొత్త కొత్తగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తుంటాం. న్యూ ఇయర్ పేరిట పార్టీలు, డీజేలు ఇలా ఎంతో జోష్‌తో కొత్త ఏడాదిని సంతోషంగా నిర్వహించుకోడం సాధారణమే. పాత ఏడాదికి గుడ్‌బై చెప్పేసి కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తుంటాం. ఎందుకంటే కొత్త సంవత్సరం తొలిరోజు ఎంత ఆనందంగా గడిపితే ఆ సంవత్సరమంతా అంత సంతోషంగా ఉండొచ్చనేది అందరి భావన. మరి, ఇదేనా కొత్త సంవత్సరం అంటే? ఇందులో కొత్తేం ఉంది ప్రతి ఏడాది లాగే పాత ఏడాది గడిచింది. క్యాలెండర్‌లో సంవత్సరం తప్ప ఏం మారింది.? ఇది కొంతమంది ప్రశ్న? ఎందుకంటే కొత్త సంవత్సరం, ఆ పదంలోనే ఉంది కదా కొత్త, మరి, ఆ కొత్తదనం ఎలా ఉంటుంది.? ఎలా మనం ఈ ఏడాదిని నూతనంగా ఎలా ప్రారంభించాలి? అసలు న్యూఇయర్‌ పేరుతో యువత కానీ, ప్రజలు కానీ చేసే పనులేంటి? కొత్తగా పెట్టుకునే లక్ష్యాలను చేరుకోవాలంటే ఎటువంటి కార్యాచరణ చేపట్టాలి. ఇప్పుడు చూద్దాం.

New Year Resolution
New Year Resolution Tips in Telugu 2024
New Year Resolution Tips in Telugu 2024 కొత్త సంవత్సం కొత్త ఆశయాలతో మొదలు మధ్యలో వదిలేస్తున్న యువత

New Year Resolution Tips in Telugu 2024 : ఈ రోజు నుంచి ఎలాగైనా ఉదయమే లేచి చదువుకోవాలి. ఈ రోజు నుంచి జిమ్‌కు వెళ్లి వ్యాయామం ప్రారంభించాలి. ఈ సంవత్సరం నుంచి డబ్బులను పొదుపు చేయాలి. ఈ రోజు నుంచి ఆఫీస్‌కు సమయానికి వెళ్లాలి. ఇలా చాలా మంది చాలా రకాల లక్ష్యాలను ఈ కొత్త ఏడాదిలో నిర్దేశించుకుంటారు. మరి, వాటిలో అమలయ్యేవి ఎన్ని? నిజంగా మీరు కొత్త ఏడాదిలో తీసుకున్న లక్ష్యాలను ఎప్పుడైనా కచ్చితంగా అమలు చేశారా? చాలా మందికి బాగా అలవాటైన పనేంటో తెలుసా? మూడు రోజులు చాలా చక్కగా న్యూ ఇయర్‌ హడావుడిలో అనుకున్న లక్ష్యం కోసం పని చేస్తారు.

నాలుగో రోజు యథావిధిగా మానేయడమో, కారణాలు చెప్పి దాని నుంచి వైదోలగడమో చేస్తారు. ఇలా చేసే వారు 100లో సుమారు 80 శాతం ఉంటారంట. కొంతమంది మాత్రమే నిర్దేశించుకున్న లక్ష్యం కోసం పని చేస్తారంట. ఒక సంస్థ చేసిన సర్వేలో వెల్లడైన (Resolution Survey in India) విషయం. అంతేందుకండి మీ మిత్రులలోనే ఎంతో మంది ఈ కొత్త ఏడాది జిమ్‌లో జాయిన్‌ కావాలని సంవత్సరంకు సంబంధించిన డబ్బులు ఒకేసారి కట్టి, వెళ్లకుండా ఉన్నవారు ఎంతమంది ఉంటారు.

New Year Resolution 2024 : కొత్త సంవత్సరంలో ఎలాగైనా చేయాలని కొన్ని లక్ష్యాలను స్వీకరిస్తారు. అవి మాములువి కాదు పెద్ద పెద్ద టార్గెట్‌లే ఉంటాయి. అందులో ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ జాబితాలో ముందుంటారు. ఇక్కడ విద్యార్థులతో పాటు వారు తల్లిదండ్రులు కూడా ఈ లక్ష్యాల కోసం వారితో కలిసి పనిచేస్తారు. ఎందుకంటే భవిష్యత్‌లో మా పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడాలంటే చదువు తప్పనిసరని చెబుతూనే వారికి కొన్ని లక్ష్యాలను వారు నిర్దేశిస్తారు.

ఉదయాన్నే లేచి చదువుకోవాలనో, లేదా టైంకు హోంవర్క్‌ పూర్తి చేయాలనో, లేదా మార్కులు బాగా తెచ్చుకోవాలనో, యూనివర్సిటీలో ర్యాంకు రావాలనో(Rank in University) ఇలా తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి లక్ష్యాలను (New Year Resolution 2024) పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రతి కొత్త ప్రారంభం ఎంతో గొప్ప శక్తి, సానుకూల భావనలతో వస్తుందని అందరి నమ్మకం. అదేనండి మన భాషలో మంచి పాజిటివ్‌ వైబ్‌ లాంటింది. ఇన్ని రోజులు ఏలాగో గడిచాయి. కనీసం ఈ కొత్త ఏడాదిలోనైనా మార్పుతో పని చేద్దామని పదిలో తొమ్మిది మంది అనుకుంటారు. ఐతే, ఇది కేవలం విద్యార్థులకేనని కాదు. కొత్తగా ఉద్యోగాల ప్రయత్నం దీర్ఘకాలీకంగా చేద్దామని చేయకుండా ఆగని ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.

కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిన తెలంగాణ

గతంలో కొవిడ్‌ కష్టాలను సాకుగా చూపించిన యువత పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దీనివల్లే పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేకపోయామని, మంచి ఉద్యోగాలు పొందలేక పోయామని, చెప్పేవారున్నారు. వారందరూ తమకు తాము ఒక ప్రశ్నను సంధించుకోవాలి. అదే సంవత్సరం మీతో చదివిన మీ మిత్రులు మంచి ఉద్యోగాలు, మంచి ర్యాంకులు, మంచి భవిష్యత్‌కు బాటలు వేసుకున్నారు. మరి, మనమేందుకు వాళ్లల కాలేకపోయామని, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. జీవితంకు విజయసూచికలా ఉండే తొలిమెట్టును విజయవంతంగా అధిరోహించాలి. ముఖ్యంగా యువత ఒకటికి మించిన ఉద్యోగ రకాలను లక్ష్యంగా నిర్దేశించుకుని సమాయత్తం అవ్వాలి. అందుకు అవసరమైన సాధన, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకోవాలి. అందుకోసం కొత్త సంవత్సరం ఆది నుంచి పని ప్రారంభించాలి.

What Is New Year Resolution : కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికాము. ఇదే సమయంలో పాత సంవత్సరం మిగిల్చిన అనుభవ పాఠాలను భవిష్యత్‌ ఆర్థిక విజయాలకు పునాదులుగా మలుచుకోవాల్సిన సమయమిదే. ఇప్పటివరకూ మనం ఎక్కడ ఉన్నాం రాబోయే రోజుల్లో ఎక్కడ ఉండాలి అని నిర్ణయించుకునే తరుణమూ ఇదే. ఆర్థికంగా పరిపుష్టి సాధించాలనే వారు కూడా కొత్త సంవత్సరంలో ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు.

ఎందుకంటే సగటు మానవ జీవతం పొదుపులతోనే మెుదలవుతుంది. ఎందుకంటే అంబానీ లాంటి స్థాయికి ఎదాగలన్న రూపాయి నుంచే మెుదలు పెట్టాలి అన్నట్టు. జీవితంలో చాలా మందికి పొదుపు అనేది భవిష్యత్‌ ఆశాకిరణం. ఐతే, కొత్తగా ఉద్యోగం సాధించిన వారైతేనేమి, లేదా కొత్తగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకునేవారికి కొత్త ఏడాది ఎప్పుడూ సహాయం చేస్తుంది. ఫీజులు, ఈఎస్​ఐలు, విహార యాత్రలు, వస్తు కొనుగోళ్లు ఇలా ప్రతి విషయానికీ ఏ నెలలో ఎంత మొత్తం అవసరం అవుతుందనే ప్రణాళిక ముందే ఉండాలి. కొత్త ఏడాదిలో అందరూ తప్పకుండా ఎమర్జెన్సీ కోసం కొంత డబ్బును పక్కన పెట్టుకోవాలి.

న్యూ ఇయర్​ స్పెషల్ గ్రీటింగ్స్​ - ఇలా శుభాకాంక్షలు చెప్తే గుండెను తాకాల్సిందే!

న్యూఇయర్‌ కానీ మరేదైనా పండగే కానీ ఆనందంగా జరుపుకోవాలంటే ముందు మనం ఆరోగ్యం బాగా ఉండాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు కానీ బాధ్యతలు కానీ నేరవేర్చడానికి వీలవుతుంది. అందుకు మంచి ఆరోగ్య ప్రణాళికను ఎంచుకోవాలి. అందుకోసం మెుదటి రోజు నుంచే శ్రమించాలి. అప్పుడే అనుకున్న మేర ఫలితాలు అందుకుంటాము. ఇందుకు చాలామంది సమయాన్ని అడ్డంకిగా చెప్పి తప్పించుకుంటారు. పట్టుదల ఉండాలే కానీ సమయం సరిపోదు అనే సమస్య ఉండదు. దానిపై ఫోకస్‌ చేస్తే బాగుంటుంది. రెండేళ్లు కరోనాతోనే ప్రజలు సవాసం చేయాల్సివచ్చింది.

New Year Resolution Health 2024 : అప్పుడు చాలా మంది ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ పెట్టారు. కానీ, అది కొన్ని రోజులే మళ్లీ మెుదటికొచ్చారు. కొత్త ఏడాదిలోనైనా చక్కగా వ్యాయమాలు, ఆరోగ్య సలహాలు పాటించండి. ఒక ఆరోగ్యకరమైన అలవాటు కచ్చితంగా మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకు మేలు చేసే హెల్తీ అలవాటుకు కట్టుబడి ఉండటం ద్వారా 2023ని ప్రారంభించవచ్చు. అసలే కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. ఎప్పుడు ముంచుకోస్తుందో తెలియని కరోనాతో జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు. కాబట్టి న్యూ ఇయర్ హ్యాపీగా , జాలీగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం, త్వరగా నిద్రలేవడం వంటివి ఈ రోజు నుంచే ప్రారంభిస్తే బాగుంటుంది.

మనం ఓ నిర్ణయం కానీ (Resolution Targets) కమిట్‌మెంట్‌ కానీ తీసుకునేప్పుడే అది పాజిటివ్‌గా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి మన లక్ష్యాన్ని సెట్ చేసుకోవటంలో ముందు ఇది ఉందో చూసుకోవడం మంచిది. అలాగే అందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను ఫుల్‌ కమిట్‌మెంట్‌తో రూపొందించుకుని పక్కగా అమలయ్యేలా చిత్తశుద్ధి చూపాలి. ఇంతకముందు మనం చర్చించుకున్న అన్ని అంశాలు అంత ఈజీగా జరిగే పని కాదని మీకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే గతంలోనూ ప్రతీ న్యూ ఇయర్‌కు మీరు ఇలాంటివే నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు. కానీ, ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్‌లు పక్కాగా అమలు కావాలంటే మాత్రం మనకు మంచి సపోర్ట్ ఉండాలంటారు నిపుణులు. అందుకే మీరు తీసుకున్న నిర్ణయాన్ని నలుగురికి చెప్పండి. సపోర్ట్ తీసుకోండి ఆ ప్రభావం చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది.

న్యూ ఇయర్ తీర్మానం: మీ డైరీలో అవి ఉంటే - మీ డైట్​లో ఇవి ఉండాలి!

ఈ కొత్త సంవత్సరంలో మీ లక్ష్యాలను మీరే సమీక్షించుకోవాలి.మనమక్కెడ ఫెయిల్ అయ్యామో దానికి కారణాలను వెతకాలి. అలా అన్ని రకాలుగా విశ్లేషణ అనేది అవసరం, దాని వల్ల గతంలో చేసిన పనులు తిరిగి చేయకుండా ఉంటారు. వీటితో పాటు మనపై మనకు చిత్తశుద్ధి ఉండాలి. మిమ్మల్ని మీరు చీట్ చేసుకుంటూ పోతే రెజల్యూషన్స్ తీసుకోవటం కాదు కదా, వాటి గురించి ఆలోచించడం కూడా వృథానే. అందుకే మీ జీవితానికే మీరే మంచి విశ్లేషకులు. కాబట్టి ఈ న్యూ ఇయర్‌లో ఏదైనా మార్పు రావాలంటే పాత అలవాట్లకు గుడ్ బై చెప్పి కొత్త అలవాట్లను ఫాలో అయినప్పుడే. నిజమైన సక్సెస్‌. ఈ నూతన సంవత్సరం మీకు కొత్త మార్గంలో నడిచేందుకు, విజయ శిఖరాలను చేరుకునేందుకు ఒక అందమైన ప్రయాణంగా మారుతుందని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్.

కొత్త ఏడాదికి ఘనంగా భారత్ ఆహ్వానం- భక్తులతో ఆలయాలు కిటకిట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.