New Year Crimes in Telangana : కొత్త సంవత్సరం వేడుకల వేళ(Newyear 2024) హైదరాబాద్‌లో పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. నగర శివారు పటాన్‌చెరులో అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నోవాపాన్ కూడలి సమీపంలో ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు సంగారెడ్డి వైపు వెళ్తున్నారు. ఇదే సమయంలో వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
నాకు పెళ్లి చేయకపోతే ఇక్కణ్నుంచి దూకేస్తా - టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
మృతిచెందిన వారు భరత్‌చంద్, నితిన్‌గా గుర్తించారు. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో(KPHB Colony) కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మోతీనగర్‌కు చెందిన అరుణ్ అనే వ్యక్తి మిత్రాహిల్స్ నుంచి హైదర్‌నగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన స్కోడా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో అరుణ్ మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా బొంగుళూరు ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుపై ద్విచక్రవాహనం అదుపుతప్పి అనిల్‌కుమార్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
సూర్యాపేటలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో మరో వ్యక్తి చనిపోయాడు. సూర్యాపేట హైటెక్ బస్‌స్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన నట్‌రాజ్ మృతిచెందగా... మరో ఇద్దరు గాయపడ్డారు. మేడ్చల్ జిల్లాలోని బాలానగర్ పీఎస్ పరిధిలో బైక్ ఢీకొని ఒకరు మృతి చెందాడు. మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడిపి ఒక వ్యక్తిని ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. మద్యం మత్తులో ఉన్న వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మటన్ బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లు - చితకబాదిన వెయిటర్లు
Drunk and Drive Cases in Hyderabad : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో(Hyderabad) పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. వేడుకల వేళ నిబంధనలు ఉల్లంఘించొద్దంటూ ముందు నుంచి హెచ్చరిస్తూ వచ్చిన పోలీసులు అదే స్థాయిలో కఠినంగా వ్యవహరించారు. ఈ చర్యలతోనే గతంలో కన్నా చాలా వరకు ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలను తగ్గించగలిగారు. నిన్న రాత్రి నుంచి నగరవ్యాప్తంగా పెద్దఎత్తున పోలీసులు తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.
మూడు కమిషనరేట్‌ల పరిధిలో 3వేల 200కి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిధిలో 15 వందలకుపైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 1,241 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 ద్విచక్రవాహనాలు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల వేళ పలుచోట్ల వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
నచ్చిన మగాడి కోసం ఎంతకైనా తెగిస్తాడు - ఏం దోచినా డైరీలో రాస్తాడు