నూతన సంవత్సర వేడుకలతో హైదరాబాద్ నగర వీధులు విద్యుత్ వెలుగులతో అలరారాయి. డివైడర్లు, కూడళ్లు ప్రత్యేకమైన లైటింగ్‌తో సరికొత్త శోభను సంతరించుకున్నాయి. రాత్రి 12 దాటిన తర్వాత పెద్ద ఎత్తున బయటకు వచ్చిన యువత, పిల్లలు నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్‌లపై హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. పబ్బులు, క్లబ్ లు, ఈవెంట్ హాళ్లు హుషారైన పాటలు, నృత్య ప్రదర్శనలు, మ్యాజిక్ షోలతో హోరెత్తాయి.
నూతన సంవత్సర వేడుకల్లో కొంత మంది యువత ఆధ్యాత్మికత చాటుకున్నారు. హైదరాబాద్ పంజాగుట్ట సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ కొత్తేడాదిలో తమకంతా శుభం కలగాలని కోరుకున్నారు.
న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని నగర పోలీసులు భద్రత చర్యలు తీసుకున్నారు. డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తూ.. రోడ్లపై సంబురాలు హద్దులు దాటకుండా.. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. కొత్తేడాది సందర్భంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కేక్ కోసి నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: ఇదిగో... నువ్ మాత్రం జాగ్రత్త సుమీ..!