అప్పగింతలు.. ఓన్లీ..పెళ్లిళ్లలోనేనా.. ఎవరైనా.. ఎవరికైనా ఇవ్వొచ్చు. అదే అంటోంది 2019. కొన్ని విషయాలను 2020కి గుర్తుచేస్తుంది. జాగ్రత్తా! అంటూ హెచ్చరిస్తోంది. ప్రజలను ఎలాంటి.. ఇబ్బందులు పెట్టొదని చెబుతుంది.
2020: ఇంతకీ నీ 2019లో ఏం జరిగింది.
2019: నేను మొదలవ్వడమే... భారీ నష్టాన్ని తీసుకొచ్చా మిత్రమా!
2020: ఏమైందీ బాస్
2019: అయ్యో...! ఎంతో మంది ఉత్సాహంగా జరుపుకునే నుమాయిష్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నేను చాలా బాధపడ్డాను. నీలో అంతా మంచి జరిగేలా చూడు మిత్రమా!
2020: అలాగే బాస్! ఇంకేం జరిగింది.?
2019: నాలో కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు లోయపడిపోయింది. దాదాపు 90 మంది చనిపోయారు. ఇది ఒక్కటే కాదు చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నీలో జరగనివ్వకు మిత్రమా!
2020: వామ్మో... ఒక ప్రాణం విలువ నాకు తెలుసు... ఎలాగైనా వాటిని అడ్డుకుంటా!! ఇంకా ఏం జరిగింది?
2019: ఆర్టీసీ ఉద్యోగులు 55 రోజుల పాటు సమ్మె చేశారు.
2020: 55 రోజులా? ఆ తర్వాత ఏమైంది?
2019: అవును! ఆ తర్వాత కాస్త ముఖ్యమంత్రి ఊరించినా... వారిని విధుల్లోకి తీసుకున్నారు. వారి కోసం ఎన్నో వరాలు ఇచ్చారు.
2020: సంతోషమే కదా!
2019: కాళేశ్వరం ప్రాజెక్టు కళ సాకారమయింది. నువ్వు కూడా ప్రజలకు నీళ్లు అందించు.
2020: కచ్చితంగా!!
2019: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎన్ఆర్సీ నిర్ణయంపై కూడా రాష్ట్రంలో రచ్చ జరిగింది.
2020: మరి ప్రభుత్వం ఏమంది?
2019: ఎన్ఆర్సీని ప్రభుత్వం వ్యతిరేకించింది. నీలో ఇలాంటి సమస్యలు లేకుండా.. ప్రజలంతా సంతోషంగా ఉండేలా చూడు.
2020: అవునా.. ఇంకా!
2019: ఈసారి పార్లమెంటు, అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
2020: అవునా!!
2019: మున్సిపల్ ఎన్నికలు నాలోనే జరగాల్సింది. కానీ కోర్టులో కేసులతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. సార్వత్రిక సమరంలో మద్యం ఏరులై పారింది. మున్సిపల్లో జోరెక్కువా. నువ్ ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది.
2020: వామ్మో.. తాగితే.. లేనిపోని గొడవలు.. మద్యం బాబుల గడ్డం పట్టుకోనైనా.. వద్దంటా.
2019: నాలో చాలా క్రైమ్ జరిగింది. దేశాన్ని మెుత్తం ఒకే మాటపైకి తెచ్చిన 'దిశ' ఘటన జరగడం బాధాకరం.
2020: దిశ ఘటనా.. ఏమైంది అసలు?
2019: పాపం ఓ అమ్మాయిని దుర్మార్గులు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. చివరకు సీన్ రీకన్స్ట్రక్షన్లో ఎన్కౌంటర్ అయ్యారు.
2020: మంచి పని అయింది. ఇంకా ఏం జరిగింది?
2019: అంతెందుకు... మన రాష్ట్రంలో కనపడని దిశలెందరో ఉన్నారు. నీలో అలాంటివి జరగకుండా చూసుకో!
2020: అంత దారుణాలు జరుగుతాయా?
2019: అంతకంటే దారుణాలు జరుగుతాయి. బయటకురాకుండా కాలగర్భంలో కలిసిన నేరాలెన్నో ఉన్నాయి. చూసుకో నీ 2020లో క్రైమ్ ఎక్కువ జరగకుండా.. జాగ్రత్తపడు మిత్రమా.
2020: ఇంకా ఏమేం జరిగాయి..నీలో?
2019: పాపం అనావృష్టితో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు.
2020: ప్రాజెక్టులు నిండాయా మరి?
2019: ప్రాజెక్టులు నిండిపోయేలా.. వర్షాలు పడ్డాయి. అతివృష్టి ఎక్కువై.. నాలోనే ఉల్లి లొల్లి జరిగింది.
2020: వర్షాలు ఎక్కువ కురిసినా సమస్యే కదా!
2019: అవునూ నీ హయాంలో ప్రాజెక్టులు నిండేలా చూడు. కానీ అతివృష్టి రానివ్వకు. అన్నదాతలు ఆవేదన చెందేలా అస్సలు చేయకు. జాగ్రత్త!
2020: సినిమా ప్రపంచం గురించి సంగతేంటీ బాస్?
2019: చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని మాత్రమే.. హిట్. కొన్నింటిలో కొన్ని మాత్రమే సూపర్ హిట్. విజయాలేమంతా చెప్పుకునేలా లేవులే. నువ్వైనా.. టాలీవుడ్‌కు విజయాలనెక్కువ ఇవ్వు.
2020: ఈసారి దర్శకులు మంచి కథలు ఎంచుకునేలా చేస్తా.
2019: అవునూ.. నిన్ను నువ్ గమించావా?
2020: ఎందుకు ఏమైంది?
2019: 01-01-20 అని ఏదైనా డాక్యుమెంట్స్‌పై రాసినా సమస్యే.. తెలివైన వారెవరైనా.. సంవత్సరం పక్కనే రెండు అంకెలు కలిపి.. గతంలోకి తీసుకెళ్లొచ్చు. ఎక్కువ తెలివైన వాళ్లైతే.. భవిష్యత్‌లోకి తీసుకెళ్లగలరు సుమీ! వీలైతే.. మెుత్తం 01-01-2020 అని రాసేలా.. జనాలకు గుర్తుచేయి.
2020: అవునవునూ..మర్చిపోయా. ఏదైనా జరిగితే.. నన్నే తిట్టుకుంటారు. గుర్తుపెట్టుకుంటా..
నీలో దు:ఖాలు..సంతోషాలు.. బాధలు.. బాధ్యతలు.. ఆప్యాయతలు.. అన్యాయాలు.. ఆవేదనలు.. ఇలా అన్ని ఉంటాయి. మనిషికి కావాల్సినవి ఇవ్వు. వాళ్లు వద్దనుకున్నవి.. నీలోనే కలిపేసుకో.. వాళ్లు సంతోషంగా ఉంటే ఇంకేం కావాలి.
నీలో దు:ఖాలు..సంతోషాలు.. బాధలు.. బాధ్యతలు.. ఆప్యాయతలు.. అన్యాయాలు.. ఆవేదనలు.. ఇలా అన్ని ఉంటాయి. మనిషికి కావాల్సినవి ఇవ్వు. వాళ్లు వద్దనుకున్నవి.. నీలోనే కలిపేసుకో.. వాళ్లు సంతోషంగా ఉంటే ఇంకేం కావాలి.
ఇదీ చదవండి: ప్రోమో: సాంగ్ ఆఫ్ ద ఇయర్ 'సామజవరగమన'