హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సిగ్నలింగ్ వ్యవస్థలో కొత్త మార్పులు తెస్తున్నారు. కూడళ్ల వద్ద వాహనాలను నియంత్రించడానికి సిగ్నల్స్‌ను మెరుగుపరుస్తున్నారు. ఇప్పటి వరకు కూడళ్ల వద్ద ఉన్న స్తంభాలపైనే సిగ్నల్స్ కనపడేవి. కానీ ఇప్పుడు రహదారిపైన ఉండే స్టాప్ లైన్ల పైనా సిగ్నల్స్ కనిపించే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కు కూడలి వద్ద అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఒక ప్రాంతానికే పరిమితమైన వీటిని పనితీరు ఆధారంగా మిగతా ప్రాంతాలకు విస్తరించనున్నారు. అనలాగ్, డిజిటల్ ల్యాబ్ సహకారంతో ఈ సిగ్నలింగ్ వ్యవస్థను చేపట్టారు.
ఇదీ చూడండి : బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత...