ETV Bharat / state

ఉత్కంఠరేపుతున్న పీసీసీ పీఠం.. దిల్లీలో ఆశావహులు - దిల్లీకి వెళ్లిన కాంగ్రెస్​ నేతలు

కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నాయకుల అభిప్రాయం మేరకే నిర్ణయమని అధిష్ఠానం స్పష్టం చేయడం వల్ల సీనియర్లల్లో గుబులు రేపుతోంది. పీసీసీ పీఠంపై ఆశలు పెట్టుకున్న వాళ్లు అధిష్ఠానం ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నారు. వేర్వేరు కారణాలతో దిల్లీ వచ్చిన ఆశావహులు ఏఐసీసీ చుట్టూ తిరుగుతున్నారు.

ఉత్కంఠరేపుతున్న పీసీసీ పీఠం.. దిల్లీలో ఆశావహులు

author img

By

Published : Dec 25, 2020, 5:01 AM IST

Updated : Dec 25, 2020, 6:47 AM IST

ఉత్కంఠరేపుతున్న పీసీసీ పీఠం.. దిల్లీలో ఆశావహులు

తెలంగాణ రాష్ట్ర.. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పీఠంపై పార్టీలో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులను అధిగమించి, పార్టీని బలోపేతం చేయగలిగే నాయకత్వం కోసం అన్వేషణ చేస్తోంది. ఇటీవల గ్రేటర్‌లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ... ఉత్తమ్‌ కమార్‌ రెడ్డి పీసీసీకి రాజీనామాతో నూతన అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్‌ వచ్చి నాలుగు రోజులు ఉండి.. నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను కూడా కాంగ్రెస్‌ అధిష్ఠానానికి నివేదించారు. డజనుకుపైగా మంది పీసీసీ పదవి కోసం పోటీ పడుతుండగా అభిప్రాయసేకరణతో వారంతా పక్కకుపోయి... ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌ రెడ్డిల మధ్యనే పోటీ నెలకొన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

సమర్థుడికే ఇవ్వాలి..

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులతోపాటు అధికార తెరాసను తట్టుకుని... భాజపా దూకుడుకు కళ్లెం వేయడమే కాకుండా... పార్టీలో చీలికలు రాకుండా చూసుకునే సత్తా కలిగిన వ్యక్తికే పీసీసీ ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది. ఇదే సమయంలో నాయకుల అభిప్రాయసేకరణలో ఎంపీ రేవంత్‌ రెడ్డికి అనుకూలంగానే ఎక్కువ మంది మద్దతు ప్రకటించినట్లు గాంధీభవన్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలంటే రేవంత్‌ రెడ్డిలాంటి దూకుడు ఉన్న నాయకుడు కావాలని పలువురు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

దిల్లీలో పడిగాపులు

మరోవైపు... అధ్యక్ష పదవి ఆశిస్తున్నవారు దిల్లీలో మోహరించారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ గౌడ్‌, పొన్నం ప్రభాకర్ దిల్లీ చేరుకున్నారు. ఇంకోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా దేశరాజధానిలో మకాం వేశారు. ఇందులో ఆశావహులంతా ఎవరికి వారు పీసీసీ పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆశావహులకు బుజ్జగింపు

కాంగ్రెస్ నాయకత్వం మాత్రం అన్ని కోణాల్లో యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న సామాజిక వర్గాలను దూరం చేసుకోకుండా అందరి అభిప్రాయాలు విన్న తర్వాతే ముందుకెళ్లాలన్న భావన ఏఐసీసీ నేతల్లో వ్యక్తమవుతోంది. పీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసినంత మాత్రాన భవిష్యత్తులో వారే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారనుకోవడానికి లేదని... అందువల్ల ఈ పదవి రాకపోయినవారు తమకు ప్రాధాన్యం తగ్గిపోయిందని భావించడానికి వీల్లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

బయట పార్టీ నుంచి వచ్చిన వారికి పదువులు కట్టబెట్టవద్దని... మొదటి నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారికే ఇవ్వాలని పలువురు నేతలు అధిష్ఠానాన్ని కోరారు. గతంలో పార్టీ విధేయుల ఫోరం పేరుతో... ఏఐసీసీకి రెండు లేఖలు కూడా రాశారు. రెండు రోజుల కిందట పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతురావు కూడా బీసీలకే పీసీసీ అధ్యక్ష పీఠం ఇవ్వాలని లేఖ రాశారు. ఈ నెల 28న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఉంది. ఆ రోజు గాంధీభవన్​లో జెండా ఎగరేయడానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా..? లేదా..? అన్నదానికి అధిష్ఠానం నుంచి ఇంకా సమాధానం రావడం లేదు. కానీ ఆశావహులంతా ఆ రోజుకల్లా అధ్యక్ష ఎంపిక పూర్తికావొచ్చని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: పండుగలు ఇంట్లోనే జరుపుకోండి: ఈటల

Last Updated : Dec 25, 2020, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.