పాత సచివాలయంలో సరైన సౌకర్యాలు లేవని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. అందుకే అన్ని హంగులతో కొత్త సచివాలయం కడుతున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల వల్ల ఇప్పటికే ఏడాది ఆలస్యమైందన్నారు. కాంగ్రెస్ నేతలు హుందాగా వ్యవహరించాలని కోరారు. అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని కాంగ్రెస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. కోర్టులకు వెళ్లి అనేక అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారన్నారు.
కాంగ్రెస్ నేతలారా.. అడ్డుకోవద్దు
ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాలను కాంగ్రెస్ నేతలే అడ్డుకున్నారని ప్రభాకర్ తెలిపారు. ఇప్పుడు ఉస్మానియాకు వెళ్లి లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైనా చిల్లర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆఖరికి మిషన్ భగీరథనూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉస్మానియా పునర్నిర్మాణాన్ని అడ్డుకున్నది ఎవరో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు.