సమాచార హక్కు చట్టం కమిషనర్ల ఎంపిక ప్రక్రియ నేడు జరగనుంది. కమిషనర్ల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ సమావేశం కానుంది. సమాచార హక్కు చట్టం కమిషనర్ల ఎంపిక కోసం మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ మధ్యాహ్నం ప్రగతి భవన్ వేదికగా సమావేశం కానుంది.
మరో ఎనిమిది మంది...
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన సమాచార హక్కు చట్టం కమిషనర్‌తో పాటు మరో కమిషనర్ ఉన్నారు. చట్ట ప్రకారం మరో ఎనిమిది మంది కమిషనర్లను తీసుకునే అవకాశం ఉంది. కమిషనర్ల పోస్టుల కోసం ఆశావహుల నుంచి ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. చాలా మంది కమిషనర్లు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఇందులో విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో పాటు న్యాయవాదులు, జర్నలిస్టులు, ఇతరులూ ఉన్నారు. దరఖాస్తులన్నింటినీ పరిశీలించి సమాచార హక్కు చట్టం కమిషనర్లను ఎంపిక చేయనుంది కమిటీ. ఖాళీగా ఉన్న ఎనిమిది కమిషనర్ పోస్టులను కమిటీ భర్తీ చేయనుంది.
ఇవీ చూడండి : 'నా భార్యను ఆ నరకం నుంచి భారత్‌కు రప్పించండి'