రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తొమ్మిది ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యామండలి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో యూనివర్సిటీలు అనుసరించాల్సిన కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
ఇప్పటి వరకు ఎనిమిది సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో నాలుగు సంస్థలకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నట్లు చెప్పారు. అన్ని అంశాలను సమీక్షించిన మంత్రివర్గ ఉపసంఘం... వచ్చే వారం మరోమారు సమావేశం కావాలని నిర్ణయించింది. విశ్వవిద్యాలయాల ప్రారంభానికి సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి.. అవసరమైన సిఫారసులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు అందించనున్నట్టు పేర్కొంది.
ఇదీ చూడండి: నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?