కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఫార్మా రంగానికి చేయూత, అభివృద్ధి, సంస్కరణలపై సూచనలు అందించారు. ఫార్మా రంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ఇచ్చారు. పాలన, పన్ను, నియంత్రణ సంస్కరణలు చేపట్టాలని మంత్రి కోరారు. నూతన ఫార్మాసూటికల్స్ విధానాన్ని తీసుకురావాలన్నారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలని పేర్కొన్నారు.
చైనాపై ఆధారపడటం తగ్గించాలి...
ముడిసరకుల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఫార్మా కంపెనీలకు సహకారం అందించాలని వివరించారు. ఫార్మా రంగంలో సులభతర వాణిజ్యాన్ని మరింత పెంచాలన్నారు. సులభతర వాణిజ్యం పెంచేందుకు నిపుణులతో టాస్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దేశ ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ మారనుందని లేఖలో స్పష్టం చేశారు. దేశ ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతానికిపైగా తెలంగాణదేనన్నారు.