కేంద్ర మోటారు వాహన చట్టం సవరణ నేటి నుంచి దేశవ్యాప్తంగా అమలుకాబోతుంది. పాత రవాణా చట్టాన్ని సవరించి జరిమానాలు భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని రోడ్లు భవనాల శాఖ ఛాంబర్లో రవాణా శాఖ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అమలు జరగాల్సిన తీరు, కాంపౌండింగ్ ఫీజు అమలు తీరు తెన్నులు, జరిమానా విధింపు, తదితర అంశాలపై ముఖ్య అధికారులతో కార్యదర్శి సునీల్ శర్మ సమీక్ష నిర్వహించారు. మరో వారం రోజుల తర్వాతే కొత్త చట్ట సవరణ అమలు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కసరత్తులు కొనసాగుతున్నాయని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : అఘాయిత్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలి: చుక్క రామయ్య